పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల
1 min read– ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం..
– అందుకే గత నాలుగేళ్లలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి.
– ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు.
– రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి దిగువ తెలుగు గంగకు , గోరుకల్లు రిజర్వాయర్ కు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ , నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ రాష్ట్ర సాగునీటి శాఖ ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తో కలిసి దిగువకు నీటిని విడుదల చేశారు. ముందుగా నాయకులకు అధికారులు ఘన స్వాగతం పలికి నీటి వివరాల గురించి స్థానిక ఎమ్మెల్యేకు ఎంపీకి వివరించారు. అనంతరం 4,5,6,7, గేట్లకు పూజల నిర్వహించి గేట్ల బటన్ నొక్కి నీటి విడుదల చేశారు. నీటి విడుదల అనంతరం కృష్ణమ్మకు చీరే సారే నీటిలో వదిలి వాయనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదాలు జగనన్నకు ఎప్పుడు మెండుగా ఉంటాయని ఇది రైతు ప్రభుత్వం అని అందుకే గత నాలుగేళ్లలో వర్షాలు సమృద్ధిగా పడ్డాయని ఈసారి వర్షాలు కొద్దిగా లేటుగా ప్రారంభమైన రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగదని కాబట్టి రాష్ట్ర ప్రజల చల్లని దీవెనలు ఎప్పుడూ జగనన్న పై ఉండాలని కోరారు. శ్రీశైల జలాశయంలో ప్రస్తుతం 869 అడగుల నీళ్లు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం కరెంటు ఉత్పత్తి పేరుతో 42 వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటుందని అలా చేయడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయినప్పుడేమో తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర విడిపోయిన కలిసిమెలిసి ఉండాలని చెప్పిన కెసిఆర్ నీళ్ల విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి కి వరుణదేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కనికరిస్తాడని రైతులు ఎలాంటి దిగులు చెందాల్సిన పనిలేదని అన్నారు. మనకు రోజుకు ఒక టీఎంసీ నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా డ్రా చేసుకునే అవకాశం ఉందని దీనిని అన్ని విధాల వాడుకుంటామని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముచ్చుమర్రి ఎత్తిపోతలను పూర్తి చేసింది తామే అని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సుమారు 90% పనులు పూర్తి చేసింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని తెలిపారు. పోతిరెడ్డిపాడు లో నాలుగు గేట్లు ద్వారా ప్రస్తుతానికి ఒక్కొక్క గేటుకు 250 చొప్పున నాలుగు గేట్లకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన రాత్రికి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారని తెలిపారు.కేఆర్ బీఎంబీ కేటాయించిన నీటి వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వైషమ్యాలకు పోకుండా ఎవరి వాటా ప్రకారం వారు వాడుకోవాలన్నారు.ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను దివగంత సీఎం రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయిందని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి అన్నారు. అయితే చంద్రబాబు తామే పూర్తిచేశామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీటిని వాడుకునే అవకాశం లేకుండా చంద్రబాబు చేశారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు.రాయలసీమకు ప్రాణాధారమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉద్యమం చేస్తే టీడీపీ నాయకులు వ్యతిరేకించడం వాస్తవం కాదా అని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు, గోరుకల్లు, అవుకు, గండికోట, మైలవరం, సర్వారాయ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం, మల్యాల, మచ్చుమర్రి, పైడిపాలెం ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టిన వైఎస్సార్ అపరభగీరథుడిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చంద్రబాబుకు ప్రజలు, రైతులపై కపటప్రేమ పుట్టుకొస్తుందన్నారు. ప్రజలు చంద్రబాబు గిమ్మిక్కులను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు సొంతంగా ప్రారంభించి పూర్తి చేసిన పథకం ఒక్కటైనా చెప్పే పరిస్థితిలో నేడు లేరన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుందూనది విస్తర్ణ, రాజోలి,జోళదరాశి రిజర్వాయర్లకు నిధులు మంజూరు చేసి పనులు సైతం ప్రారంభించారన్నారు. రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులతో మోసపోకుండా గ్రామాల్లోనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఆసరాగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పోతులపాడు గ్రామ సర్పంచ్ నిర్మలమ్మ నీటిపారుదల శాఖ యస్ఈ నారాయణ రెడ్డి ,ఈఈ మనోహర్ రాజు, డీఈ నాగేంద్ర కుమార్,జలమండలి డీఈ నాగరాజు ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర నీటి పారుదల శాఖ అధికారులు, జలమండలి రాష్ట్ర చైర్మన్ కర్ర గిరిజా హర్షవర్ధన్ రెడ్డి, లింగాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి జూపాడుబంగ్లా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం చైర్మన్ కరుణాకర్ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిదులు రైతులు తదితరులు పాల్గొన్నారు.