పంట పొలాలకు నీటిని విడుదల చేయాలి
1 min readపల్లవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ లో పంట పొలాలకు నీటి విషయంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది, వెలుగోడు వైఎస్ఆర్సిపి మండల నాయకులు తిరూపం రెడ్డి మాట్లాడుతూ మద్రాస్ కాలువ గేటులు 15వ తేదీన మోయాల్సింది ఉండగా దానికి 20 తేది వరకు పొడిగించడం జరిగింది, దానిమీద వెలుగోడు కి చెందిన రైతులు ముయ్యాలని తెలుగంగ అధికారులను అడగడం జరిగింది, వెలుగోడు మండలంలోని మోత్కూరు బోయిరేవుల మరియు బండి ఆత్మకూరు మండల రైతులు మాకు 20వ తేదీ వరకు నీటిని విడుదల చేయాలని కోరారు, అందుకు గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి గారు స్పందించి నేను వెలుగోడు మండల రైతులతో పాటు బండి ఆత్మకూరు మండలం రైతుల ప్రయోజనాలను కాపాడుతానని తెలియజేశారు, దీనిపైన తిరూపం రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నాయకులు నీటిని ఆపకుండా కిందికి వదలాలని డిమాండ్ చేశారు, దానికి మా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు నీటిని వారబందీ ప్రకారం వదిలి నీటిని పొదుపు చేసి ఆరోజు ఏదైతే మాటిచ్చారో ఏప్రిల్ 15 వరకు నీటిని ఇవ్వడం జరిగింది, అదే వారబంధి లేకుండా అదే ఆపకుండా నీటిని కిందికి వదిలి ఉంటే ఫిబ్రవరి చివరి వరకు కూడా నీరు వచ్చేది కాదు, అదే మా ఎమ్మెల్యే శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి గారు ముందు చూపుతో రైతులను అందరిని అప్రమత్తం చేసి వాళ్లను ఒప్పించి వారబందీ ప్రకారం కిందికి నీళ్లు వదులుతూ ఒక వారం గేట్లు మూసేస్తే ఈరోజు ఏప్రిల్ 15 వరకు దీనిని కొనసాగించడం జరిగింది , అయినను ఇంకా పంటలు పూర్తి కానందున ఈ నెల ఆఖరి వరకు నీటిని ఇవ్వాలని రైతులు కోరుచున్నారు ఆరోజు వదిలి ఉంటే ఈరోజు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని తెలియజేశారు , రైతుల ప్రయోజనాల కోసం మా ఎమ్మెల్యే శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి గారు సొంత డబ్బును కూడా ఖర్చుపెట్టి రైతులకు నీళ్లు ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గారికి దక్కిందని తెలియజేశారు, గత సంవత్సరంలో అబ్దుల్లాపురం రైతులకు ఇదే పరిస్థితి ఎదురైతే దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు చేసి మూడు కోట్ల రూపాయల పంటను కాపాడడం జరిగింది. నేను కూడా 25 సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్న ఏ నాయకుడు కూడా రైతుల కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు అని తెలియజేశారు, గతంలో రేగడగూడూరు గ్రామంలో కూడా కేసీ కెనాల్ కు నీళ్లు రాని పరిస్థితి ఉంటే అప్పుడు కూడా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గారు దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి పార్టీలకు అతీతంగా అందరూ రైతులకు ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా నీళ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రజాసేవ చేసే నాయకుడిని మన నియోజకవర్గం ప్రజలు అందరూ పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను , ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు రైతులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.