PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న లేఅవుట్లలో వాటర్ సప్లై కల్పించాలి

1 min read

– అడిగిన వాళ్లకు వెంటనే విద్యుత్ కనెక్షన్ మీటర్ ఇవ్వాలి
– వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన కలెక్టర్ గిరీషా పిఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: పేదల కోసం పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన వైయస్సార్ జగనన్న కాలనీలలోని అన్ని లేఅవుట్ లలో నీటి సరఫరా పనులు వేగవంతం చేసి నీటి సదుపాయం కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులను కలెక్టర్ గిరీషా పిఎస్ ఆదేశించారు. బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్లో వైయస్సార్ జగనన్న కాలనీలలోని అన్ని లేఔట్లలో నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ పెండింగ్ తదితర పనులు పురోగతిపై హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో కలెక్టర్ గిరీషా పిఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరీషా పిఎస్ మాట్లాడుతూ…. ఇళ్ల నిర్మాణం వేగవంతం కోసం అన్ని లేఔట్ లో వాటర్ సప్లై ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. పీలేరు 14 లేవుట్ లు, గుర్రంకొండ 2, కె.వి.పల్లి 6, తదితర మండలాల్లోని లేఔట్లలో నీటి సదుపాయం కల్పించాల్సి ఉందని, ఆ పనులు పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయా లేఔట్లలో బోర్ తో పాటు పైప్లైన్ కనెక్షన్ ఇవ్వాలన్నారు. వచ్చే బుధవారం కల్లా రాజంపేటలో నీటి సరఫరా పనులు పెండింగ్లో ఉండకూడదన్నారు. బోరుకు ఎలక్ట్రికల్ కనెక్షన్ పెండింగ్ లేకుండా త్వరగా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. కొత్త కాలనీలలో వాటర్ సప్లై శాంక్షన్ చేసి పనులు త్వరగా ప్రారంభించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. దాదాపు 18 వేల ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యాయని, 5000 వేల ఇళ్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్ మీటర్ ఇచ్చారని, అడిగిన వాళ్లకు వెంటనే విద్యుత్ కనెక్షన్ మీటర్ ఇవ్వాలన్నారు. వచ్చే నెలలోగా రాష్ట్రంలో 5 లక్షల ఇల్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించాలని ఉన్నారని, ఆదిశగా అధికారులందరూ బాధ్యతగా ఇళ్ల నిర్మాణం వేగవంతం కోసం పనిచేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో హౌసింగ్ పిడి శివయ్య, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసన్నకుమార్, పబ్లిక్ హెల్త్, తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author