PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మున్సిపాలిటీలో నీటి చోరులు….

1 min read

– అక్రమంగా  కుళాయి కనెక్షన్లు…ప్రభుత్వ ఆదాయానికి గండి.

పల్లెవెలుగు  వెబ్ నందికొట్కూరు:  మున్సిపాలిటీల్లో అక్రమ నీటి వినియోగానికి అడ్డూ అదుపులేకుండా పోయింది. వక్రమార్గంలో నీటిని వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. దీంతో నీటి రూపంలో కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. అవసరం అంటూ తాగునీటి కుళాయి తీసుకోవడం… ఆపై వాణిజ్య అవసరాలకు మళ్లించుకోవడం పరిపాటిగా మారింది. హోటళ్ళు, బహుళ అంతస్తుల భవనాలు, ప్రైవేటు విద్యా సంస్థలు, దుకాణాల్లో ఇలా చాలా వరకు గృహ వినియోగ నీటి కుళాయిలనే వినియోగిస్తున్నాయి. దీనితో మున్సిపాలిటీ కి  రావాల్సిన  ఆదాయానికి గండి పడుతోంది. ఏళ్ల తరబడి ఈ తంతు సాగుతున్నా అధికారులు వీటిపై దృష్టిసారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ కుళాయి కనెక్షన్లు, మీటర్లు లేని కుళాయి కలెనక్షన్లు గుర్తించిన దాఖలాలు లేవని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో సామాన్యులకు తాగునీరందని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు . నందికొట్కూరు పట్టణంలోని కోటా వీధి లైన్ లో కొందరు  ప్రభుత్వ కుళాయికి అక్రమంగా  కనెక్షన్ వేసుకున్నారని ఆ కనెక్షన్ ను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ కు  కాలనీవాసి లోకేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.అధికారులు ఏర్పాట్లు చేసిన  జిఎల్ఆర్ఎస్ వాటర్ ట్యాంక్ నుంచి నేరుగా అక్రమంగా కనెక్షన్ కొందరు వ్యక్తులు వేసుకున్నారని  తెలిపారు. ఈ అక్రమ కనెక్షన్ వలన కొన్ని కుటుంబాలకు నీళ్లు రావడంలేదని తెలిపారు.  అధికారులు స్పందించి వెంటనే అక్రమ కనెక్షన్ తొలగించాలని వారు కోరారు.

About Author