నదుల అనుసంధానాన్ని తప్పు పట్టిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా
1 min readపల్లెవెలుగువెబ్ : వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ నదుల అనుసంధానాన్ని తప్పు పట్టారు. ఏటా వేల టీఎంసీల నీరు వృథా అవుతున్న నేపథ్యంలో నదుల అనుసంధానం ద్వార నీటి కొరత ఉన్న ప్రాంతాలకు నీరు ఇవ్వొచ్చు కదా ? అన్న ప్రశ్నకు ఆయన ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. నదుల అనుసంధానమే తప్పు. నదుల అనుసంధానం పేరిట పనులు చేపడితే ఇదివరకే ఉన్న నదులన్నీ దెబ్బతింటాయి. నదులపై, నీళ్లపై రాష్ట్రాలకు ఉన్న హక్కులన్నీ కాలరాయడమే ఆ పథకం లక్ష్యం. నదులపై హక్కులను బడాబాబులకు అప్పగించాలనే కుట్ర నదుల అనుసంధానంలో ఉంది. నదుల సహజత్వం ఈ పథకం వల్ల దెబ్బతింటుంది. ఎక్కడికక్కడ నీటి వనరులను కాపాడుకుంటూనే భూగర్భ జలాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక కావేరీలో నీటి కొరతకు ప్రధాన కారణం ఆయా రాష్ట్రాల్లో పండిస్తున్న వాణిజ్య పంటలే. ఒక టీఎంసీ నీటితో తెలంగాణలో 12 వేల ఎకరాలు సాగవుతుండగా... కావేరీ పరివాహక ప్రాంతంలో ఒక టీఎంసీతో మూడువేల ఎకరాలు మాత్రమే సాగయ్యే పంటలు పండిస్తున్నారు
అని అన్నారు.