భూమిని రక్షించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది
1 min read– కమిషనర్ షేక్ షాహిద్
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : మానవ మనుగడకు జీవనాధారమైన భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని నగర కమిషనర్ షేక్ షాహిద్ అన్నారు.స్థానిక సెయింట్ థెరీసా కాలేజీలో శనివారం నిషేధిత ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కమిషనర్ షాహిద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కలిగి, నిత్యం ఆచరణలో ఉండాలన్నారు.ఇళ్లలో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై ప్రతి విద్యార్థినీ,విద్యార్థులు దృష్టి సారించాలన్నారు.నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల భూమి మరియు భూమిపై నివసించే జీవరాశులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు, ఎన్జీటీ ఆదేశాల అనుసరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జులై 1వ తేదీ నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించిందన్నారు.ముఖ్యంగా డ్రైనేజీలు,కాలువల్లో, ప్లాస్టిక్ వ్యర్ధాలు వేయడం వల్ల పర్యావరణం కలుషితమై,నీటి కాలుష్యం వల్ల ఆయా ప్రాంతాల ప్రజలు రోగాలు బారిన పడే అవకాశం ఏర్పడుతుందన్నారు.భూమి రక్షణకై స్వచ్ఛమైన గాలి,నీరు, పర్యావరణ పరిరక్షణకై సామాజిక బాధ్యతగా ప్రతి విద్యార్థినీ,విద్యార్థులు కృషి చేయలన్నరు.గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నగరపాలక సంస్థ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు.ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని కమిషనర్ షాహిద్ తెలిపారు.ముందుగా కమిషనర్ షాహిద్ కళాశాల ఉపాధ్యాయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు,కార్యక్రమం అనంతరం నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై కళాశాల ఉపాధ్యాయులు, అధికారులతో కలసి కమిషనర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు, కార్యక్రమంలో భాగంగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకం అరికాడతమని వాటి వినియోగాన్ని తగ్గిస్తామని కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులతో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.ఎస్ ఆర్. మెర్సి,గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ మనోహరి,హెల్త్ అధికారులు డాక్టర్ మాలతి,డాక్టర్ గోపాల్ నాయక్,షిరాజ్,సిస్టర్ స్టెల్లా,కళాశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.