NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వారసత్వ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది..

1 min read

– రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సెక్రెటరీ జి వాణి మోహన్

– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తో మ్యూజియం, బుద్ధా పార్క్ సందర్శన..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : మన  దేశ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను రేపటి తరం వాళ్ళకి తెలియజేసేందుకు పురావస్తు ప్రదర్శనశాలలు ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపుల్ కార్యదర్శి జి. వాణిమోహన్ అన్నారు. ఏలూరులో శుక్రవారం’ ఆడుదాం ఆంధ్రా’ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన అనంతరం ఏలూరులోని అగ్రహారంలో ఉన్న పురావస్తు శాఖ జిల్లా మ్యూజియం ను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ , ఇతర అధికారులతో కలిసి వాణీమోహన్ సందర్శించారు.  ఈ సందర్భంగా వాణిమోహన్ మాట్లాడుతూ అపురూపమైన  ప్రాచీన శిల్పాలు, ప్రాచీన కళాఖండాలు మన చారిత్రక వారసత్వ సంపదని, వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.  జిల్లాలోని ప్రాచీన కళారూపాలను పరిశీలించారు.  శిల్పాలు, ఇతర కళాఖండాలను మ్యూజియం లో భద్రపరచిన తీరును వాణిమోహన్ పరిశీలించారు.. అనంతరం అక్కడ నుండి బుద్ధ పార్క్ కు చేరుకొని, గతంలో తాను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన  సమయంలో ఏర్పాటుచేసిన బుద్ధ పార్క్ ను ప్రస్తుతం అభివృద్ధి చేసిన పనులను పరిశీలించి అధికారులను అభినందించారు.వాణిమోహన్ వెంట జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్  కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, సెట్ వెల్ సీఈఓ ఎం డి. మెహ్రరాజ్, తహసీల్దార్ సోమశేఖర్, కాంట్రాక్టర్ గోలి శరత్ రెడ్డి  ప్రభృతులు పాల్గొన్నారు.

About Author