పాత్రికేయులకు ఎప్పుడూ అండగా ఉంటాం…ఎమ్మెల్యే
1 min read
పల్లెవెలుగు , మంత్రాలయం : నియోజకవర్గంలోని పాత్రికేయులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం ఓ ప్రైవేట్ వసతి గృహంను ప్రారంభించేందుకు వచ్చారు. అనంతరం ప్రజాశక్తి సీనియర్ పాత్రికేయులు వడ్డే మాధవ్ సతీమణి శ్రీమతి ఇందిర కు ఇటీవల మేజర్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఇంటికి క్షేమంగా రావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , వైసిపి మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి , యువ నాయకులు దశరథ రెడ్డి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్ స్వామి, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి వడ్డే మాధవ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ జరిగిన విషయం పై ఆరోగ్య పరిస్థితుల గురించి వివరాలు అడిగి తెలుసుకొని ధైర్యంగా ఉండాలని ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో వడ్డే నారాయణ సోదరులు, కుమారులతో కొద్ది సేపు చర్చించారు.