PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాది రైతు ప్రభుత్వం రైతులను ఆదుకుంటాం

1 min read

– ఎంపీ -నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు భరోసా
– పంట నష్టంపై సర్వే చేయించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తా
– కుందూ నది బ్రిడ్జి ఎత్తు పెంచుటకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు వినతి
– పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్న నంద్యాల ఎంపీ పోచా
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలోని తలముడిపి, జలకనూరు గ్రామాల్లో గత మూడు రోజుల క్రితం వడగండ్లతో కురిసిన భారీ వర్షం వల్ల రైతులు వేసిన పంటలు విపరీతంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.ఆదివారం మధ్యాహ్నం నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి తలముడిపి,జలకనూరు గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న మిరప,మొక్కజొన్న,అరటి,బొప్పాయి తదితర పంటలను ఎంపీ పరిశీలించారు.గ్రామంలో జరిగిన పంట నష్టం గురించి ఆయన స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా నంద్యాల ఎంపీ పాత్రికేయులతో మాట్లాడుతూ భారీ వర్షానికి రైతులు వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వీటిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని అంతేకాకుండా కౌలు రైతుల సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.రైతులకు ఏఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.మాప్రభుత్వం రైతుల ప్రభుత్వమని నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.అనంతరం తలముడిపి గ్రామంలో కుందూ నది బ్రిడ్జి లో లెవెల్లో ఉన్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్రిడ్జి ఎత్తు పెంచుటకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ ప్రజలు ఎంపీకి వినతిపత్రం అందజేశారు.ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి,నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,మిడుతూరు జెడ్పిటిసి యుగంధర్ రెడ్డి,మాజీ ఏఎంసీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,వైస్ ఎంపీపీ నబి రసూల్,సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,తలముడిపి సర్పంచ్ వెంకటేశ్వర్లు,నందికొట్కూరు ఏడిఏ విజయ శేఖర్,ఏఓ పీరు నాయక్,ఉద్యాన శాఖ అధికారి తేజస్విని,దాసి కృష్ణారెడ్డి,ఎంపిటిసి హరి సర్వోత్తమ రెడ్డి,జలకనూరు వైసీపీ నాయకులు మల్లు శివ నాగిరెడ్డి, పుల్లయ్య,రవి,రామలింగారెడ్డి,చింతలపల్లె మల్లేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author