PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాబు కోసం మేము సైతం – క్షేత్ర స్థాయి ప్రజా చైతన్య కార్యక్రమాలు

1 min read

కక్షపూరితంగానే నారా లోకేష్ ను కూడా కేసుల్లో ఇరికిస్తున్నారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మంత్రులకు లేదు

నారా లోకేష్ ని విచారణకు పిలిచిన అధికారులు కేసుకు సంబంధంలేని ప్రశ్నలు వేయడం విడ్డూరంరాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మరియు రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్  మరియు రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ మోమిన్ అహమ్మద్ హుసేన్   ఆధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు  మున్సిపాలిటీ 13 వ వార్డుల్లో రహమత్ నగర్,కుబ్రా మసీద్ ఏరియా నందు ప్రజా చైతన్య కార్యక్రమం జరిగింద  ఈ సందర్భంగా మోమిన్ అహమ్మద్ హుసేన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ని అక్రమ అరెస్టు చేసి ఇబ్బందులు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ని కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం దారుణం అన్నారు. నిన్న జగన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు  అరెస్టుకు తనకు సంబంధం లేదని చెప్పడం అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేదా అనే అనుమానాలకు వ్యక్తం కలుగుతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఏసీబీ, ఈడీ సంస్థలు డిజిపిని ముఖ్యమంత్రిని అడగకుండా ఏ కార్యక్రమం చేస్తారో తెలపాలన్నారు. పట్టపగలే అబద్ధాలు ఆడడంలో జగన్ రెడ్డి సిద్ధహస్తుడని,తనకు చానల్ లేదు తనకు పత్రిక లేదని ఎన్నోసార్లు బహిరంగ సభలలో చెప్పిన జగన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైసిపి మంత్రులు ఒక్కరు కూడా శాఖ గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులను దూషించడంమే పనిగా పెట్టుకున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వైసిపి మంత్రులకు లేదన్నారు.ఆయన నైతిక విలువలు కలిగిన నాయకుడని ఆయన తెలుగుదేశం పార్టీతో  పొత్తు కలవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాయలసీమ యువ నాయకుడు  మోమిన్ ముస్తఫా, టిడిపి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ జబివుల్ల,సింగిల్ విండో మాజీ డైరెక్టర్ Dr. సలాం,మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, తెలుగు యువత అధ్యక్షుడు గోస్ మాలిక్,13వ వార్డు టిడిపి నాయకులు మున్నా, సయద్ ఉస్మాన్,చాంద్ బాషా,జకీర్,తెలుగు యువత ఉపాధ్యక్షుడు మనోహర్,తెలుగు యువత కార్యదర్శి గఫూర్,  13వార్డు టీడిపి నాయకులు షఫీ,రియాజ్,మురళి, సయాద్ మసూం,ఆరిఫ్, మాబాష ,మొహమ్మద్, నబిసా,ముర్తుజా,అబ్దుల్,షేర్ అలీ, షాకీర్, హాజీ సలాం,హాజీ గౌండ బాబు, బాషా, శేక్ష , శఫివుల్ల, కలీమ్ తదితరులు పాల్గొన్నారు.

About Author