NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్​ఈసీ స‌మావేశాన్ని బ‌హిష్కరిస్తున్నాం: ప‌వ‌న్

1 min read

అమ‌రావ‌తి: ఎల‌క్షన్ క‌మిష‌న్ శుక్రవారం ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని బ‌హిష్కరిస్తున్నట్టు జ‌న‌సేన పార్టీ ప్రక‌టించింది. ఈ మేర‌కు ఆ పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర ఒక ప్రక‌ట‌న వెలువ‌డింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల మీద ఎస్ఈసీ తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ప‌వ‌న్ తెలిపారు. ఏప్రిల్ 2న అఖిల‌ప‌క్ష స‌మావేశానికి రావాల‌ని గురువారం సాయంత్రం ఆహ్వానం పంపి .. రాత్రికి రాత్రే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేయ‌డం అప్రజాస్వామిక చ‌ర్యగా భావిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కేవ‌లం అధికార పార్టీకి మేలు చేసే విధంగా ఎస్ఈసీ చ‌ర్యలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. నిలిచిపోయిన ద‌గ్గర నుంచి ఎన్నిక‌లు ప్రారంభించ‌డం స‌రికాద‌న్నారు. ఈ అంశం మీద హైకోర్టులో వాద‌న‌లు న‌డుస్తు ఉండ‌గా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచికాద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

About Author