NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాం.. ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ఇంటి స్థలాలు లేని పేదవారికి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలలో గృహ నిర్మాణానికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే కాటసాని తెలిపారు బుధవారం నాడు గడివేముల టౌన్ లో ఎస్సార్ బీసీ కాలనీలో దాదాపు 271 లబ్ధిదారులకు జగనన్న ఇళ్లస్థలాల పట్టాలను ఆర్డీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పంపిణీ చేశారు గ్రామంలో దాదాపు పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చినట్టే అని కొంతమంది ఎవరైనా మిగిలిపోయి ఉంటే వివరాలు ఇవ్వాలని వారికి కూడా న్యాయం చేస్తామని గృహ నిర్మాణాలు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు అనంతరం కార్యకర్తలు ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ జడ్పిటిసి ఆర్ బీ చంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్ ఎక్కల దేవి రవణమ్మ ఎంపీటీసీ వంగాల మహేశ్వర్ రెడ్డి ఉపసర్పంచ్ బాల చెన్ని. తాసిల్దార్ శ్రీనివాసులు ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప  లబ్ధిదారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author