NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగుల‌కు జీతాలివ్వలేని స్థితిలో ఉన్నాం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నీటి వివాదం లాగే మూడు రాజధానుల అంశాన్ని కేంద్రమే ప‌రిష్కరించాల‌ని వైకాపా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు అన్నారు. మూడు రాజ‌ధానుల అంశం, ఏపీ ఆర్థిక ప‌రిస్థితి పై కేంద్రానికి లేఖ రాశారు. పార్లమెంట్ ఆమోదించిన చ‌ట్టానికి అసెంబ్లీలో స‌వ‌ర‌ణ కుద‌ర‌ద‌ని, మూడు రాజ‌ధానుల‌పై పార్లమెంట్ లో చ‌ట్టస‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింద‌ని తెలిపారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా దివాళ తీసే స్థితి వ‌చ్చింద‌ని అన్నారు. నెల‌లో 15వ తేదీ వ‌చ్చినా రాష్ట్రంలో ఉద్యోగుల‌కు జీతాలివ్వలేని స్థితిలో ఉన్నామ‌ని తెలిపారు. గ‌తంలో ఎన్నడూ లేని ఆర్థిక స్థితి రాష్ట్రంలో ఉంద‌ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

About Author