PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్యాక్రాంతమవుతున్న మున్సిపాలిటీ స్థలాల పరిరక్షణ బాధ్యత మాది

1 min read

– అనవసర రాజకీయాలు రాద్ధాంతాలు తగవని హితవు పలికిన మున్సిపల్ వైస్ చైర్మన్ లు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో అన్యా క్రాంతమవుతున్న స్థలాలను పరిరక్షించే బాధ్యత మున్సిపాలిటీదని ఈ విషయా లపై అనవసర రాజకీయాలకు తావులేదని, రాద్ధాంతం తగవని, సహేతుకంగా లేని అంశాలపై చర్చలు తగవని నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషా వలి హితవు పలికారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం స్థానిక రామకృష్ణ విద్యాలయం రైతుబజార్ వెనుక భాగంలోని మున్సిపాలిటీకి చెందిన స్థలంపై కొందరు వ్యక్తులు చేసిన అనవసరపు రాద్దాంతానికి స్పష్టతనిచ్చారు . ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా మాట్లాడుతూ.. సంజీవనగర్ రైతు బజార్ వెనుక ఉన్న స్థలం మున్సిపాలిటీకి దాతలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ స్థలంలో విద్యార్థుల క్రీడలకు, స్థానిక ప్రజలకు, పట్టణ ప్రజలకు వాకింగ్ ట్రాక్ మాదిరిగాను, చిన్నపాటి సమావేశాలు నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులో స్పష్టం చేసిందని తెలిపారు. అయితే ఈ స్థలంను కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటూ స్థలాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన ఈ స్థలాన్ని సంరక్షించేందుకు కౌన్సిల్లో తీర్మానించిన ప్రకారం ఆ స్థలంలో రక్షణ గోడ నేర్పిస్తున్నామన్నారు. ఈ విషయంపై కొందరు వ్యక్తులు రాజకీయాలు చేస్తూ ఎమ్మెల్యే పై అనవసర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కనీసం వార్డు కౌన్సిలర్ హోదా లేని వారు కూడా ఎమ్మెల్యేని విమర్శించడం హాస్యస్పదమన్నారు. నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఎవరి స్థాయి ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని తెలిపారు. ఎమ్మెల్యే, శిల్పా సేవా సమితికి స్థలాన్ని కబ్జా చేస్తున్నాడని తప్పుడుగా మాట్లాడం చూస్తుంటే, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని ఘాటుగామర్శించారు. తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మరని తెలిపారు. హైకోర్టు తీర్పులో శాశ్వత కట్టడాలను నిర్మించరాదని తెలిపారని, కేవలం అన్యాక్రాంతం అవుతున్న మున్సిపాలిటీ స్థలాన్ని మున్సిపాలిటీ వారు రక్షణ గోడ కట్టడం జరుగుతుందన్నారు. ఈ స్థలాన్ని ఎవరు కబ్జా చేయడానికి వీలులేదని మున్సిపాలిటీ స్థలాల సంరక్షణ బాధ్యతలో భాగంగా ఈ చర్యలను చేపడుతున్నామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి నాయకులు లక్ష్మీనారాయణ, సోమశేఖర్ రెడ్డి, సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author