PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖర్చులు పెడుతూనే ఉన్నాం పైసా రావడం లేదు.. సర్పంచులు

1 min read

– రైతుల గోనెసంచుల అవినీతిపై రభస -ఉపాధి సిబ్బంది సర్పంచులకు సమాచారం ఇవ్వడం లేదని సర్పంచుల ఆగ్రహం -రసాబాసగా మిడుతూరు మండల సర్వసభ్య సమావేశం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మంగళవారం ఉదయం 11 గంటలకు మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం జరిగినది.ఈసమావేశం రసాభాసగా హాట్ హాట్ గా కొనసాగింది.జలకనూరు సర్పంచ్ కురువ ఎల్లయ్య మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ప్రతి సమావేశంలో మేము పెట్టిన బిల్లులు కావాలని మొత్తుకొని చెప్పినా బిల్లులేమో రావు కానీ ఆపని చేయండి ఈపని చేయండి అని చెబుతారు.త్రాగునీటి పైపులు లీకేజీలు ఉన్నచోట మరమ్మతులు అదేపనిగా చేస్తూనే ఉన్నాం కానీ ఈ బిల్లులు కావాలని సమావేశంలో జలకనూరు సర్పంచ్ అడగగా దీనికి బదులుగా అధికారులు కొందరు బిల్లులు ఇవ్వచ్చు.మరికొందరేమో బిల్లు ఇవ్వడానికి రాదని అధికారులు చెప్పడం విశేషం.అంతేకాకుండా గ్రామాల్లో శాశ్వతంగా ఉండే పనులను చేయాలనే చేస్తాం మేము గ్రామంలో ఉండే వారం.మీరు(ఉద్యోగులు)మీకేం తెలుసు గ్రామాలకు అటు వచ్చి కుర్చీలో కూర్చుని వెళ్లడం కాదు.సర్పంచులను గుండు గీయించడానికి ఉన్నారా మీరంతా మీదగ్గర తప్పులు పెట్టుకొని మమ్మల్ని అంటారా..మీరు అధికారులు గ్రామాలకు ఎప్పుడో ఒకసారి వస్తారు వెళ్తారంటూ జలకనూరు సర్పంచ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,బైరాపురం సర్పంచ్ ఫణి భూషణ్ రెడ్డి,తిమ్మాపురం సర్పంచ్ నాగస్వామి రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి సిబ్బంది సర్పంచులకు తెలియకుండానే పనులు చేయిస్తున్నారని అంతే కాకుండా రైతులకు ఉపయోగపడని పనులు చేస్తున్నారని రైతులకు ఉపయోగపడే పనులు చేయాలని అంతేకాకుండా గ్రామ సభలకు సర్పంచులకు సమాచారం ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి కలుగజేసుకొని టెక్నికల్ అసిస్టెంట్లను అందరిని పిలిచి మీకు సర్పంచులు అంటే లెక్క లేదా గ్రామంలో ప్రతి పని వివరాలు మరియు గ్రామ సభలకు మీరు వారికి ఎందుకు చెప్పడం లేదంటూ ఉపాధి సిబ్బందిపై ఎంపీడీవో మండిపడుతూ మీ ప్రవర్తన మార్చుకోకపోతే జిల్లా కలెక్టర్ కు మిమ్మల్ని అందరిని సరెండర్ చేస్తానని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నాగలూటి గ్రామంలో కరెంటు స్తంభాలు లేకపోవడం వలన ఇండ్లు చీలికలు వస్తున్నాయని అక్కడ కరెంటు స్తంభాలు ఎప్పుడు వేస్తారు ఎన్ని రోజులకు వేస్తారని తులసి రెడ్డి, వైస్ ఎంపీపీ నబి రసూల్ ట్రాన్స్కో ఏఈ క్రాంతి కుమార్ ను అడిగారు.మండల జడ్పిటిసి సభ్యుడు పర్వత యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఏఏ గ్రామాలకు రోడ్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపారని పంచాయతీరాజ్ ఏఈ ప్రతాప్ రెడ్డిని అడిగారు.కడుమూరు,పైపాలెం రోడ్డు అద్వానంగా ఉందని అన్నారు.తలముడిపి సర్పంచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో జరిగిన రైతుల గోనె సంచుల పంపిణీ చేయకపోవడంపై రసా భాసగా సాగింది.అంతేకాకుండా గతంలో వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కొక్కరి దగ్గర నుంచి పదివేల రూపాయలను కట్టించామని ఈసంపూర్ణ గృహ హక్కు రక్ష పథకం దస్తావేజు మీకు ఉండటం వలన రాబోయే రోజుల్లో బ్యాంకులలో రుణాలు ఇస్తారని చెప్పి డబ్బులు కట్టించామని వారు బ్యాంకులకు వెళ్తే రుణాలు ఇవ్వమని బ్యాంకు వారు చెబుతూ ఉన్నారని గ్రామాల్లో మమ్మల్ని నిలదీస్తున్నారని తలముడిపి సర్పంచ్ అన్నారు.మిడుతూరు జగనన్న కాలనీలో రైతుల బండ్లు పోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని రోడ్డును వేయించాలని కోరారు.ఈకార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రవణమ్మ,ఎంపిటిసిలు,ఆయా గ్రామాల సర్పంచులు,ఏవో పీరు నాయక్,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాధ్,అంగన్ వాడి సూపర్వైజర్లు వరలక్ష్మి,రేణుక,సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి,ఈసీ నరేష్,వెలుగు సీసీలు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

About Author