PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డాక్టర్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం

1 min read

– అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం (న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్) కేంద్రాన్ని సందర్శించినట్లు తెలిపారు.ఆస్పత్రిలోని న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ బిల్డింగ్ లను పరిశీలించి అనంతరం APMSIDE ఇంజనీర్లు లతో ఆరా తీశారు త్వరలో న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ బిల్డింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు.ఈ డయాగ్నస్టిక్ బ్లాక్ లో CT ఎమ్మారై, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ మరియు ఎక్సరే, అల్ట్రా సౌండ్ స్కానింగ్, మరియు ఇతర స్కానింగ్స్ ఇలా ప్రజలకు అవసరమైన సదుపాయాలు అన్ని ఒకే చోట ఉండడం వలన ప్రజలకు ఎంతగానో ఉపయోగకరం ప్రజలకు ఒక్కొక్క ఇన్వెస్సిగేషన్స్ ఒక్కొక చోట ఉండకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ ఒకే చోట ఉండేటట్లు ఉండడం వల్ల చాలా ఉపయోగపడనున్నట్లు తెలియజేశారు. ఆస్పత్రిలోని క్యాజువల్టి విభాగాన్ని పరిశీలించారు అనంతరం క్యాజువల్టి డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్, DAP/DAS/డ్యూటీ అసిస్టెంట్ సర్జన్, మరియు ఆర్తో, డాక్టర్స్ రూములను పరిశీలించారు డాక్టర్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.బ్లడ్ బ్యాంక్ ని సందర్శించి అక్కడున్న సిబ్బందితో బ్లడ్ యక్క నిలువల గురించి ఆరా తీశారు.మానసిక విభాగం ఓపీ (సైకియాట్రి) పరిశీలించారు అనంతరం ఎలెక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ECT) మిషన్ అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు కేసులు చేయడం లేదు అని అక్కడున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు (ECT) కేసులను చెయ్యాలని ఇంచార్జ్ HODకి ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, ENT అసిస్టెంట్ ప్రొఫెసర్, డా.శివప్రసాద్ రెడ్డి, మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి, గారు తెలిపారు.

About Author