అమీర్ ఖాన్ లా చేయలేకపోతున్నాం : చిరంజీవి
1 min read
పల్లెవెలుగువెబ్ : లాల్‌సింగ్ చద్దా’ తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితోపాటు అమీర్ ఖాన్, నాగ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అమీర్ ఖాన్ భారతీయ సినిమాకు ఒక ఖజానా. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గొప్ప నటుడు అనిపించుకున్నాడు. అమీర్ ఖాన్ నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టం. అమీర్ ఖాన్‌లాగా మేం చేయాలనుకుంటాం. కానీ మాకున్న పరిధుల వల్ల చేయలేకపోతున్నాం.