పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు ఖండిస్తున్నాం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ కర్నూలు జిల్లా జనసేన పార్టీ నాయకులు పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చింత సురేష్ బాబు విలేకరుల సమావేశం స్థానిక బిర్లా కాంపౌండ్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా చింత సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సామర్లకోటలో అధికారిక కార్యక్రమంలో పాల్గొని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ పై హేయమైన నీచమైన భాషను వాడుతూ వ్యక్తిగత జీవితం గురించి నీచంగా దిగజారి మాట్లాడడాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాధనాన్ని వేచించి అధికారిక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైయస్సార్ సిపి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 151 నియోజకవర్గాలు ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారని వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్ పాలసీల గురించి మాట్లాడుతుంటే ఆయన వాహక జీవితం గురించి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం సిగ్గుచేటని. రాష్ట్రంలో 30 లక్షల గృహాలు నిర్మిస్తామన్న హామీ ఇచ్చారని 7 లక్షల గృహాలు కూడా నిర్మించిన దాఖలాలు లేవని విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని నిర్మించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని ప్రతి ఏటా జనవరి కి జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను మోసం చేశారని ఈ ప్రభుత్వంలో 8 సార్లు కరెంటు, ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి అదనంగా చెత్త పన్ను వసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వమని మండిపడ్డారు. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేపించుకొని రాయలసీమ లో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం హేయమైన చర్య అని మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి రాష్ట్రంలో నాణ్యతలేని కల్తీ మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదని ప్రశ్నించారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని గన్ను కంటే ముందు జగన్ వస్తాడని చెప్పిన మహిళా మంత్రి రోజా భవ్య శ్రీ హత్య జరుగుతే ఎక్కడి కూడా మహిళా మంత్రులు స్పందించలేదని మండిపడ్డారు. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని తక్షణమే వైయస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణకి క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో జనసేన పార్టీ కార్యచరణ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ వీర మహిళ ప్రాంతీయ కమిటీ కోఆర్డినేటర్ హసీనా, సుమలత జిల్లా నాయకులు మంజునాథ్ సుధాకర్ సతీష్ షబ్బీర్ బజారి రాంబాబు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.