NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ మంత్రి శంకర్ నారాయణ పై బాంబు దాడిని ఖండిస్తున్నాం..

1 min read

– కర్నూలు జిల్లా కురువ సంఘం…..

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పెనుగొండ ఎమ్మెల్యే మాజీమంత్రి శంకర్ నారాయణ కాన్వాయ్ పై బాంబు దాడిని తీవ్రంగా ఖండించిన కర్నూలు జిల్లా కురవ సంఘం అద్యక్షడు పత్తికొండ శ్రీనివాసులు ,అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి కోశాధికారి కే .సి .నాగన్న  ఖండించారు.  అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని ఒక గ్రామంలో వెళుతుండగా కారుపై బాంబు దాడి జరిగింది. అయితే అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు విసిరిని వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్టు తెలిసింది. ఇలాంటి పిరికి పంద చర్యలు చేయడం సరైనది కాదని రాజకీయంగా ఎదుర్కోలేకనే శంకర్ నారాయణ పై బాంబు దాడికి పాల్పడ్డారని కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు ఖండించారు.నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు .

About Author