NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

4 నెల‌లుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నాం : ఏపీ ఎన్జీవో ప్రెసిడెంట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల‌కు స‌కాలంలో జీతాలు అందాల‌ని తిరుమ‌ల వెంక‌టేశ్వర స్వామిని వేడుకున్నట్టు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస‌రావు తెలిపారు. ఉద‌యం విఐపి ప్రారంభ ద‌ర్శన స‌మ‌యంలో స్వామి వారి సేవ‌లో పాల్గొన్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగుల‌కు స‌కాలంలో జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌క కూర‌గాయ‌లు, పాల వారి ద‌గ్గర చుల‌క‌న భావం ఏర్పడింద‌ని ఆయ‌న అన్నారు. నాలుగు నెల‌లుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నామ‌ని చెప్పారు. 11వ పీఆర్సీని అమ‌లు చేయ‌డంతో పాటు.. జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని కోరారు.

About Author