ఒకటో తేదీ జీతాలు అందక.. ఈఎంఐ చెల్లించలేకపోతున్నాం
1 min read– బ్యాంకు మేనేజర్ ను కలిసి వినతిపత్రం అందజేత.. పట్టించుకోని పాలక ప్రభుత్వం..
చైర్మన్ కె రమేష్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏ.పి.జె.ఏ.సి అమరావతి రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం మాలి దశ ఉద్యమ కార్యాచరణ లో భాగంగా “బ్యాంకు ల సందర్శన యాత్ర” కార్యక్రమములో భాగముగా ఏలూరు లో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ కె. రమేష్ కుమార్ ఆద్వర్యములో ఏలూరు నందు గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏలూరు మేనేజర్ ని కలసి ప్రతి నెల 1 వ తేదిన ఈ రాష్ట్ర ప్రభుత్వమూ నెల జీతములు మరియు పెన్షన్లు ఇవ్వకపోవడము వలన ఉద్యోగులు అందరు (ఈఎంఐ) లను జమ చెయ్యలేక, దీంతో వడ్డీల కు డబ్బులు తెచ్చి సదరు వడ్డీల భారంతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు అని, బ్యాంక్ వారు పెనాల్టీ/ ఛార్జీలు విధిస్తున్నారనీ, అంతే కాకుండా Cibil score కూడా తగ్గిపోతుందని దీని వలన అదనపు ఆర్థిక భారం తో బాటు భవిష్యత్తులో ఉద్యోగులు బ్యాంక్ నుండి రుణం పొందే అవకాశం కూడా కోల్పోతున్నారని మరియూ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్దేశ్యపూర్వకంగా ఈఎంఐ లు చెల్లించక పోవడం ఎంతమాత్రం కాదని, ప్రభుత్వం వారు ప్రతీ నెలా మొదటి తేదీన జీతాలు ఇవ్వనందునే చెలించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని, దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అయితే ఈఎంఐ లు చెల్లించేందుకు ప్రతి నెలా ఒకటి, రెండు తేదీలు ఉన్నాయని, ఇవి కట్టలేక వడ్డీలతో ఉద్యోగులు విలవిలలాడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఎన్ని మార్లు ఏపీ జేఏసీ అమరావతి పక్షనమున విన్నవించినా ప్రభుత్వo నిర్లక్ష్యల ధోరణితో పట్టించుకోవడము లేదని, బ్యాంకర్లు పెద్ద మనసు చేసుకుని ఉద్యోగుల పట్ల కనికరము చూపి మాకు సహకారమందించాలని మెమొరాండం సమర్పించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వమూ 1 వ తేదీనే ఉద్యోగులకు జీతములు మరియు పెన్షనర్లకు పెన్షను జమ చెయ్యాలని డిమాండ్ చేసారు. 1 వ తేదీనే ఉద్యోగులకు జీతములు మరియు పెన్షనర్లకు పెన్షను తీసుకోవడము ఉద్యోగుల యొక్క నైతిక హక్కు అని తెలియజేసారు. ఈ కార్యక్రమములో ఏపీ జేఏసీ అమరావతి జనరల్ సెక్రెటరి బి. రాంబాబు, ఏ. ప్రమోద్ కుమార్, రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్, జిల్లా కార్యదర్శి, పంచాయితి రాజ్ ఇంజనీర్ జిల్లా కార్యదర్శి ఆర్. వీరబాబు, ఏపీజేఏసీ అమరావతి సభ్య సంఘ నాయకులూ పాల్గొన్నారు.