పేదలకు మంచి జరగాలంటే..మళ్ళీ జగనన్నే సీఎం కావాలి..!
1 min readశాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి..
వైసీపీ ఎన్నికల ప్రచారానికి అనూహ్యమైన స్పందన.
కోట వీధిలో ఎన్నికల ప్రచారం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పేదలకు మంచి జరగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి గా జగనన్నే రావాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దారా సుధీర్ , ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మనంద రెడ్డి లకు మద్దతుగా సోమవారం శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి నందికొట్కూరు మున్సిపాలిటీలో 18,19 వ వార్డు కోట వీధి లో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఉదయం కోట వీధిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో భాగంగా కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం గత ఐదు ఏళ్ళుగా ప్రజలకు చేసిన మేలును అలాగే అభివృద్ధిని ప్రజలకు వివరించారు.ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు బాగుండాలంటే మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని అన్నారు.సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ మన్నారు.సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ జగనన్ననే గెలిపించుకోవాలని సూచించారు.ప్రతిపక్షాలు ఎన్.డి.యే కూటమిగా ఏర్పడి జగనన్న పై యుద్దం చేస్తున్నారన్నారు.మీ ఓటే ఆయుధంగా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్, యువ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి,ఎంపీపీ మురళి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్, సోమశేఖర్ రెడ్డి (పండు), గుర్రాల భాస్కర్ రెడ్డి, కిషోర్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, రాఘవ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, ఉపాధ్యక్షులు చింతా విజ్జి, ఉపేంద్ర రెడ్డి, జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ సుకుర్ , వైసీపీ మండల కన్వీనర్ రవి యాదవ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు జబ్బార్, జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచ జగదీశ్వర రెడ్డి, మందడి రవీంద్రా రెడ్డి, వైస్ ఎంపీపీ లు పబ్బతి రవికుమార్, తోకల క్రిష్ణా రెడ్డి, జూపాడుబంగ్లా మండల జె.సి.యస్ కన్వీనర్ కేశవరెడ్డి నాగార్జున రెడ్డి, శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రమేష్ నాయుడు, కౌన్సిలర్లు కాటెపోగు చిన్నరాజు, లాలు ప్రసాద్, బీ.సి నాయకులు కాళ్ళూరి శివ ప్రసాద్, పి.శ్రీధర్ రెడ్డి, తర్తూరు నాగిరెడ్డి, నందికొట్కూరు పట్టణ యూత్ వింగ్ ప్రెసిడెంట్ లడ్డూ, డిష్ భాస్కర్, పులేంద్ర నాయుడు, సెంట్రింగ్ వలి, మహమ్మద్, రైతు సంఘం బాబు, ఆర్ట్ శ్రీను, వెంకట రెడ్డి, కోట భాస్కర్ రెడ్డి, బ్యాల్ల శ్రీను, కొసిక తిరుమలేశ్వర రెడ్డి, బన్నూరు మద్దిలేటి రెడ్డి, బ్రహ్మయ్య ఆచారి, బోయ శేఖర్, చల్లా శివారెడ్డి, బద్రి, పి.రమేష్, కురువ శ్రీను, వి.శ్రీనివాస రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గోవింద రెడ్డి, పి.భాస్కర్ రెడ్డి, యు.రఘునాథ రెడ్డి, శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.