బాధిత కుటుంబాలను ఆదుకోవాలి…
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది లో జరుగుతున్న నాగనంది వసతి గృహాల కూల్చివేత పనుల వద్ద ప్రమాద వశాత్తు మరణించిన వారి కుటుంబాలకు దేవాదాయశాఖ తరపున ఆర్థికంగా ఆదుకోవాలని శ్రీశైల నియోజక వర్గం, కేసికెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బన్నురు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం ఆర్జేడీ చంద్రశేఖర ఆజాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సంఘటనపై విచారణకు వచ్చిన ఆయనను మహానంది దేవస్థానం కార్యాలయంలో కలసి మాట్లాడారు. సంఘటన జరగడం బాధాకరమని ఇందుకు కారణమైన కాంట్రాక్టర్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే దేవస్థానం తరపున ఆర్థిక సహాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వారివెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మౌళీశ్వర రెడ్డి, మహానంది దేవస్థానం మాజీ చైర్మన్ నాగ భూపాల్ రెడ్డి,జనార్దన్ రెడ్డి, కంచర్ల శివ, గడ్డం నాగపుల్లయ్య,వేమూరి కేశాలు, నందిపల్లి మహేశ్వర రెడ్డి, గంగిశెట్టి మల్లికార్జున, రామచంద్రుడు,రాజా, సుదర్శన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, కిట్టు,గంగవరపు మహేశ్వర రెడ్డి,మాజీ ఎంపిటిసి దస్తగిరి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.