PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల పెన్నిదైన మీ నాయకత్వమే …మాకు కావాలి

1 min read

సాయినాథ్ శర్మ ను కలిసి మద్దతు ..ప్రకటించిన అనిమెల నాయకులు
పల్లెవెలుగు వెబ్ కమలాపురం:  నియోజకవర్గం లో పేదల పెన్నిధిగా నిరుపేదల సేవకుడిగా ప్రజాభిమానం పొందిన మీ నాయకత్వమే మాలాంటి సామాన్య ప్రజానీకానికి అవసరమని కమలాపురం నియోజకవర్గం వీరపునాయుని పల్లె మండలం అనిమేల గ్రామానికి చెందిన నాయకులు కమలాపురం నియోజకవర్గ ప్రజా సేవకుడు నాయకుడు సాయినాథ్ శర్మ తో అన్నారు.కమలాపురం పట్టణం లోని ఆయన నివాసానికి విచ్చేసిన అనిమెల గ్రామానికి చెందిన నర్రేడ్డి శివరామిరెడ్డి దూదేకుల బీసి సంఘ నాయకుడు మిట్టపల్లి మస్తాన్ తదితరులు ఆన్నారు.కమలాపురం బుధవారం సాయినాథ్ శర్మ ను కలిసిన అనంతరం వారు విలేఖరులతో మాట్లాడారు.కమలాపురం నియోజకవర్గం లో గత రెండు దశాబ్దాలుగా నాయకత్వ లేమితో సామాన్య ప్రజానీకం ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని ప్రజా సేవకుడు గా ప్రజలలో గర్వం లేకుండా ప్రజలలో కలిసిపోయే ప్రజాభిమానం ఉన్న మీ లాంటి వ్యక్తి అవసరం నియోజక వర్గానికి అవసరం ఉందన్నారు..మీ వెంట మేము ఉండి నడుస్తామని చెప్పారు త్వరలో గ్రామానికీ రావాలని వారు సాయినాథ్ శర్మ ను కోరారు.

About Author