PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

1 min read

ఐసా ఉమ్మడి కర్నూలు జిల్లా నూతన కమిటీ ఎన్నిక

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విద్యార్థులు యువత ఎదుర్కొంటున్న సమస్యలపై  సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్-ఐసా రాష్ట్ర కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు. కర్నూలు  పట్టణంలోని ఐసా ఉమ్మడి కర్నూలు జిల్లా మహాసభలలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ  దేశంలో ఎక్కడా అమలు చేయని జాతీయ విద్యా విధానాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మతోన్మాద కేంద్రాలుగా తయారు చేస్తున్నాయని మండిపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్య ప్రయివేటికరణ,కాషాయీకరణ అవుతుందని దీనికి రాష్ట్ర ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో విద్యా,వసతి దీవెనలను దశలవారీగా కాకుండా ఒకేసారి విడుదల చేయాలని అలాగే రాష్ట్రంలో ఉన్న వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేసి సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అధికారంలోకి రాకముందు ఒకేసారి రెండు లక్షల 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చినా తర్వాత నిరుద్యోగులను మోసం చేశారని ఈ ప్రభుత్వానికి 2024లో పతనం తప్పదని హెచ్చరించారు.ఉమ్మడి కర్నూలు జిల్లా మహాసభలకు అబ్జర్వర్ గా హాజరైన కామ్రేడ్ అనిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా రాజు , నాగార్జున, ఉపాధ్యక్షులుగా పెద్దయ్య సహాయ కార్యదర్శులుగా రంగస్వామి, పవన్ ,ఏలియా రాజు ,కార్యవర్గ సభ్యులుగా వర్ధన్, నాని, పవన్, అంజి, వంశీ,షామియేల్ రాజ్  లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐసా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తామని ప్రతి మండలంలో ఐసా విద్యార్థి సంఘాన్ని బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

About Author