‘మన మిత్ర’ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
1 min read
నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో అందిస్తున్న ఈ-సేవలను నగర పౌరులు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు సూచించారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి ‘మన మిత్ర’ బ్యానర్ బోర్డులను మేనేజర్ అందించారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలను ప్రజలకు అత్యంత సులువుగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెనెన్స్ తీసుకొచ్చిందన్నారు. వాట్సాప్‌లో 9552300009 నెంబర్ ద్వారా వివిధ రకాల ధృవీకరణ పత్రాలు, పన్ను చెల్లింపులు తదితర సేవలను ప్రతి పౌరుడు తన మొబైల్‌లోనే పొందవచ్చని తెలిపారు. దీనిని విసృత ప్రచారం కల్పించేందుకు ప్రతి సచివాలయం వద్ద బ్యానర్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు మేనేజర్ వెల్లడించారు.