NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణానికి కృషి చేయాలి..

1 min read

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్

ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించండి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల పట్టణంలోని చిన్నచెరువు కట్ట వద్ద స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెండా ఊపి ప్రారంభించారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర జిల్లా ఇంచార్జి స్పెషల్ అధికారి జె నివాస్, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ ప్రతినెల మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సిఎస్ తెలిపారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో చెత్తాచెదారం తొలగింపు, ప్లాస్టిక్ పేపర్లను తొలగించడం తదితర రకరకాల పరిశుభ్రత పనులు చేపట్టి స్వచ్ఛ ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే చిన్నచెరువు కట్టపై ఉన్న చెత్తాచెదారాలను తొలగించడంతోపాటు వాకింగ్ ట్రాక్ ను మెరుగులు దిద్ది అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.మన పరిసరాల పరిశుభ్రతతో పాటు, మనం పని చేస్తున్న ప్రదేశాలు, మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలని ఆయన సూచించారు. ఎప్పుడైతే అన్ని ప్రదేశాలలో పరిశుభ్రతకు స్థానం కల్పిస్తారో తద్వారా వార్డు, పట్టణం, జిల్లా, రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటాయని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉన్నట్లయితే పరిశుద్ధమైన ఆలోచనలు కూడా పెంపొందించుకోవచ్చన్నారు. ప్రతినెల ఒక కార్యక్రమం చొప్పున ఈ నెలలో  “సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం – పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం” అనే థీమ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలని ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు,  పట్టణాలలో పరిశుభ్రత కార్యక్రమాలు ముమ్మరం చేసి ప్రజలందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రభుత్వం చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలందరూ వడివడిగా అడుగులు వేసి రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. అంతకుముందు చెరువుగట్టుపై మొక్కలు నాటే కార్యక్రమంలో సిఎస్ పాల్గొని మొక్కలను నాటి నీళ్ళు పోశారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా 3 వ శనివారం నాడు నెలకొక థీమ్ చొప్పున పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ నెల“సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం – పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం” అనే థీమ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజలందరి చేత స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆర్డీఓ విశ్వనాధ్, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *