ప్రతి జనసైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆంధ్రప్రదేశ్ జనసేన కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు , పెద్దన్న అయితే, ఆలూరు నియోజకవర్గం జనసేన కుటుంబాలకు తెర్నేకల్ వెంకప్ప చిన్న కొడుకు , చిన్న తమ్ముడు అవుతారు. ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి జనసైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం: తెర్నేకల్ వెంకప్ప, ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ . హొళగుంద మండల కేంద్రంలోని ఇంద్ర నగర్ కు చెందిన యువకుడు బళ్లారి ఈశ్వర్ కు అగ్నిప్రమాదం లో ప్రమాదవశాత్తు కాలు, చెయ్యి కోల్పోవడం జరిగింది. ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ తెర్నేకల్లు వెంకప్ప సహకారంతో హొళగుంద మండలం జనసేన అధ్యక్షులు అశోక్ 10,000 రూపాయలు ఆర్థికసహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీను, చిన్న, ఈరన్న, వీరేష్, మంజు, పెన్నేష్ పాల్గొన్నారు.