రిటైర్డ్ వ్యవసాయ అధికారి ఫకృద్దీన్ కుటుంబానికి అండగా ఉంటాం
1 min read
మంత్రాలయం, న్యూస్ నేడు : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో అనారోగ్యంతో మృతి చెందిన రిటైర్డ్ వ్యవసాయ అధికారి, ఇన్చార్జ్ ఎంపిడిఓ ఫకృద్దీన్ కుటుంబానికి అండగా ఉంటామని వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన సాయంత్రం వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి తో కలిసి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల రైతులకు, ప్రజలకు ఎన్నో సేవలు అందించారని తెలిపారు. మంచి అధికారిగా పేరు సంపాదించుకున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం భాధాకమని అన్నారు.
