దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం – ఆప్టా
1 min readపల్లెవెలుగు వెబ్ అమరావతి : గౌరవనీయులు ఆర్ జె డి శ్రీ ప్రతాప్ రెడ్డి గారిపై నిన్న జరిగిన దాడిని అప్తా సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అప్తా రాష్ట్ర అధ్యక్షుడు ఎ. జి. ఎస్.గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశరావు తెలియజేసారు, శ్రీ ప్రతాప్ రెడ్డి గారు రీజినల్ జాయింట్ డైరెక్టర్ హోదా లో వున్న తన కంటే కింది స్థాయి లో వున్న ఉద్యోగులను, టీచర్లను స్నేహాపురితంగా మరియు ఆప్యాయత తో పలకరించడం అయన స్వభావం అనే విషయం అయన తో పరిచయం వున్న ప్రతి ఒక్కరికి తెలుసు.అదే విధంగా సమావేశాల్లో పలకరించడం తప్పు కాదు అని ఇది సంతోషించదగ్గ పరిణామం అని,ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాధికారులు తమ అహంకారం ను టీచర్ల పై చూపుతూ ఉపాద్యాయులను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్న ఈ కాలంలో ప్రతాపరెడ్డి గారు వారితో స్నేహ పూరితంగా ఉంటూ వారితో పని చేయించే ఇలాంటి అధికారిని ప్రోత్సహించాలని వారు కోరారు . తన మీద అపవాదు లు మోపి లబ్ది పొందాలని ప్రయత్నం చేసే వారి ఆటలు కట్టించేందుకు అయన తన ప్రతి సమావేశం ను లైవ్ లో రికార్డ్ చేసి యు ట్యూబ్ లో ఉంచుతున్నారు. నిన్నటి సమావేశంలో ఎన్నికపరమైన అంశాలు ఉన్నదని భావిస్తే లేదా అధికార దుర్వినియోగం చేస్తున్నారు అని భావిస్తే తగిన సాక్ష్య అధారాలతో ఎన్నికల అధికారులకు, పై స్థాయి అధికారులకు పిర్యాదు చేయాలే తప్ప విద్యా శాఖ లో ఒక ఉన్నత అధికారి పై భౌతిక దాడులకు మరియు దౌర్జన్య పూరిత చర్యలకు పాల్పడటం హేయమైన చర్య. దీనిని ఏ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం అని సంఘం రాష్ట్ర నాయకులు గణపతి రావు, ప్రకాష్ రావు తెలియజేసారు. దయచేసి విద్యార్థి సంఘాల నాయకులు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంయమనం పాటించ వలసినదిగా కోరుచున్నామని వారు పత్రికాముఖంగా తెలియజేసారు.