NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీనివాసులు రెడ్డి అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం

1 min read

– టీడీపీ నేత చమర్తి జగన్ రాజు గారు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి గారిని, మరియు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి,సీనియర్ నాయకులు శ్రీ భూమిరెడ్డి రామ గోపాల రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ దుర్మార్గమైన పిలికిపంద చర్య అని ప్రముఖ విద్యావేత్త,రాజంపేట నియోజకవర్గం సీనియర్ నాయకులు చమర్తి జగన్ రాజుగారు అన్నారు. ఈ అక్రమ అరెస్ట్ కు వ్యతిరేఖంగా సీనియర్ నాయకులు చమర్తి జగన్ రాజు గారు, ఒంటిమిట్ట సీనియర్ నాయకులు కొమరా వెంకట నరసయ్య గారు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులతో కలసి పోలీస్ లకు వ్యతిరేఖంగా నిరసన తెలిపారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .మంత్రి విసిరిన సవాల్ ను స్వీకరించి టీడీపీ నాయకులు కడప నడిబొడ్డుకి చర్చ కు వస్తే..అక్రమంగా కడప లో అరెస్ట్ చేసి, ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణమండపం లో అక్రమంగా,అమానుషంగా నిర్బంధించడం తగదు అని అన్నారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పుడుతున్న అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోకమానదుఅన్నారు.ఇప్పటికైనా ఇటువంటి చర్యలను మానుకొని,గాడి తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టుకోమని అధికార పార్టీ నాయకులకు హితబోధ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కడప రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి హరిప్రసాద్, రాష్ట్ర కల్లు గీత కార్మీక మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య,మండల పార్టీ మాజీ అధ్యక్షులు మామిడిక్ శ్రీనివాసులు,హరినాధ రెడ్డి,శివారెడ్డి, షేక్ రంతు, బొడ్డిచెర్ల శ్రీనివాసులు, మల్లికార్జున,సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author