PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య విషయంలో పూర్తి బాధ్యత వహిస్తాం..

1 min read

నగరపాలక సంస్థ కో- ఆప్షన్సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు

400 మందికి గుర్తింపు కార్డులు

రేడియం ఎఫ్రాన్లు, షూ, చేతి గ్లౌజులు పంపిణీ..

పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా మెడికల్ చెకప్ లు

ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు, సాధారణ మరణానికి 2 లక్షలు కుటుంబ సభ్యులకు వర్తింపు..

కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పారిశుద్ధ్య కార్మికులు మరియు నాన్ పారిశుద్ధ్య కార్మికులకు  ఆరోగ్యం,అభివృద్ధి విషయంలో పూర్తి పర్యవేక్షణ మేము తీసుకుంటున్నామని. మీరు మంచి సేవలు ప్రజలకు అందించాలని ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో శనివారం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, నాన్ అవుట్సోర్సింగ్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్,నైట్ శానిటేషన్,మలేరియా విభాగాల్లో పనిచేస్తున్న మొదలగు 400 మంది కార్మికులకు గుర్తింపు కార్డులు,రాత్రిపూట మెరుస్తూ ఉండే రేడియం యాప్రాన్లు, షూ,చేతి  గ్లౌజులు, మొదలగునవి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కో-ఆప్షన్  సభ్యులు  ఎస్ ఎం ఆర్ పెదబాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ వహిస్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మరియు ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు కూడా మెడికల్ చెకప్ లు చేయించడం కంటిన్యూగా జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు,సాధారణ మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నామన్నారు.అదేవిధంగా కార్మికులు కూడా  శానిటేషన్ విషయంలో ఎక్కడ అలసత్వం వహించకుండా పనిచేసి ప్రభుత్వానికి,కార్పొరేషన్ పాలకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఎస్ ఎం ఆర్ పెదబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి,మున్సిపల్ మేనేజర్ మూర్తి, కార్మిక నాయకులు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author