కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీరిచ్చాం !
1 min read
పల్లెవెలుగువెబ్ : కుప్పం కంటే ముందుగా పులివెందుల కు నీరిచ్చిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదని ఆ పార్టీ నేత లోకేష్ తెలిపారు. కుప్పంకి నీరు వెళ్లకుండా అడ్డుకున్న దుష్టబుద్ధి సీఎం జగన్‌రెడ్డిదని దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి కొత్త ప్రాజెక్ట్‌లు ఎలాగూ కట్టలేరని, కనీసం ఉన్న ప్రాజెక్టులకూ మరమ్మతులు చేయించట్లేదని తప్పుబట్టారు. సీఎం జగన్‌కు లోకేష్ లేఖ రాశారు. జలవనరుల ప్రాజెక్ట్‌లు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏఏ తేదీల్లో ఏఏ ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తుందో.. జలవనరుల మంత్రి 2019 జులై 10న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, జలవనరుల మంత్రి ప్రకటించి నేటికీ 34 నెలలు అయిందని గుర్తుచేశారు.