ఉద్యమకారుడు జలం శ్రీను ఆశయాలను సాధిస్తాం
1 min read– రవికుమార్,రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ ఉద్యమంలో అమరుడైన జలం శ్రీను ఆశయాలను సాధిస్తామని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ అన్నారు కర్నూలు నగరంలోని స్థానిక రాయలసీమ విద్యార్థి పోరాట సమితి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన రాయలసీమ ఉద్యమంలో మరణించిన జలం శ్రీను చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం రాయలసీమను ఫ్యాక్షన్ గడ్డగా చూపుతూ రాయలసీమలో ప్రజలు బాంబులు కత్తులు పట్టుకొని తిరిగే వారిగా రాయలసీమ వాసులు మనుషుల రక్తం తాగే మనస్తత్వం కలిగిన వారిగా విలన్లుగా చూపుతూ రాయలసీమ ప్రాంతాన్ని కించపరిచే సినిమాలు తీస్తున్నారని ఆవేదనతో తమతోపాటు హైదరాబాద్ వెళుతూ ఆక్సిడెంట్ లో తీవ్ర గాయలపాలై జలం శ్రీను మరణించారన్నారు శ్రీను మరణించిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా రాయలసీమ విద్యార్థి పోరాట సమితి అనేక ఉద్యమాలను నిర్వహిస్తోందని రాయలసీమ హక్కులైన శ్రీబాగ్ ఒప్పందం అమలు,రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి,నికరజలాల కేటాయింపులో రాయలసీమకు న్యాయం చేయాలని,కర్నూలులో రాజధాని,గుంతకల్లులో రైల్వే జోన్,కడపలో ఉక్కు పరిశ్రమ,చిత్తూరులో ఐటీ హబ్, రాయలసీమలో కరువు వలసల నివారణ తదితర అంశాలపై నిత్యం పోరాడుతూ జనం శ్రీను ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న ఆర్విపిఎస్ నాయకులు రవికుమార్,విజయకుమార్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.