కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం..
1 min read– వై నాగేశ్వరరావు యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు , వెబ్ కర్నూలు: జాతీయ బీసీ సంక్షేమసంగం ఆధ్వర్యంలో విజయవాడ గాంధీ నగర్ లో కందుకూరి కల్యాణమండపం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం మరియు అన్ని జిల్లాల అధ్యక్షులు రౌండ్ టేబుల్ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్త్ర అధ్యక్షులు లాకా వెంగళరావు గారు , రాష్ట్ర ఇంచార్జి కానమ్మ గారు , జాతీయ కన్వీనర్ నాగేశ్వరరావు గారు , రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గాప్రసాద్ గారు , ఇతర రాష్ట్ర కార్యవర్గం సభ్యలు , చిత్తూర్ జిల్లా అధ్యక్షులు పీబీ లక్ష్మీప్రసన్నకుమార్ ,అధికారప్రతినిధి బంగారు నారాయణస్వామి , అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు, గుట్టబాబు, అధ్యక్షులు రామానుజులు , తిరుపతి జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ , ప్రధానకార్యదర్శి జగన్నాధ , తదితర అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ 26 జిల్లాలలో జిల్లా కమిటీలు 90% పూర్తి అయినవి. బీసీ సమస్యలపై గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పోరాడదాం. త్వరలో ఎన్నికలు జరుగుతున్నవి సంఘం బలోపేతానికి కృషి చేయాలి. కులాలవారిగా జన గణన జరిపించాలి. చట్ట సభల్లో బి.సి లకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో ప్రత్యేక బి.సి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలి. ప్రతి ఒక్క బీసీ జాతీయ బీసీ సంక్షేమసంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వమును బలపరచాలి , అన్ని జిల్లాల కార్యవర్గాలను పూర్తిచేసుకోవాలి , రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలి , వెంటనే జనగణన చేపట్టి బీసీల సంఖ్య తెలపాలి, రోజుకొక పేరుతో శాశ్వతత్వం లేని కొత్త గా పుట్టుకొస్తున్న సంఘాలతో ఏమరుపాటు లేకుండా బీసీలు జాగురుత వహించాలి అని సందర్భంగా తెలియజేశారు. నిష్కల్మషంగా నిస్వార్థంగా యావత్తు బీసీ ల కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు తట్టుకుని పనిచేస్తున్న జాతీయ బీసీ సంక్షేమసంఘం నాయకులంతా ఐకమత్యమై బీసీలు రాజ్యాధికారం చేపట్టే దాకా పోరాటతమని ఈ సందర్భంగా తెలియజేశారు.