NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రీడలను ఎప్పటికి ప్రోత్సహిస్తాం.. టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో జె.కె అకాడమీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కరాటే, బాక్సింగ్, ఫిట్ నెస్ అకాడెమీ, ట్యుటోరియల్ సెంటర్ ను కర్నూలు టీడీపీ ఇంఛార్జీ టిజి భరత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలన్నారు. అన్ని వసతులతో ఈ అకాడమీని ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. దీన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని పిల్లలను క్రీడల పట్ల ప్రోత్సహించాలన్నారు. క్రీడలకు ఇతర దేశాల్లో ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మనదేశంలో ఇవ్వడం లేదని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మన దేశంలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కర్నూల్ నుంచి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. కర్నూల్లో క్రీడలకు మా టీజీవి సంస్థల తరఫున, ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున ఎంతో సహకారం అందిస్తున్నామన్నారు. ఈ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని.. విద్యార్థులు కూడా సర్టిఫికెట్ల కోసం క్రీడలను ఎంచుకోకుండా పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. అనంతరం కరాటే స్టేట్ లెవల్ పోటీల్లో విజేతలకు ఆయన మెడల్స్ అందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్‌ హరికిషన్‌, కెఎన్‌ఆర్‌ పాఠశాల కరస్పాండెంట్‌ టి.గోపీనాథ్‌, కరాటే మాస్టర్లు ఫయాజ్‌, చందు, రమణ, గౌస్‌ బాషా, రాము పాల్గొన్నారు. చివరగా జెకె అకాడమీ కోచ్ జగదీష్‌ను టిజి భరత్ అభినందించారు.

About Author