‘కందికొండ’ కు అండగా ఉంటాం : కేటీఆర్
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ గేయ రచయిత కందికొండకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కందికొండకు గతంలోనూ అండగా నిలిచామని, ఇప్పుడు కూడ అండగా ఉంటామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖకు కేటీఆర్ స్పందించారు. కందికొండ ఆరోగ్య, ఆర్థిక విషయాల గురించి తన ఆఫీసు సిబ్బంది.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో మాట్లాడి సాయం అందిస్తారని పేర్కొన్నారు. కొంతకాలంగా కందికొండ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో చికిత్సకు తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో కేటీఆర్ మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కందికొండ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె కట్టలేక ఇల్లు ఖాళీ చేశారు. ఈ విషయం మంత్రి దృష్టికి తెచ్చింది కందికొండ కమార్తె మాతృక.