కర్నూల్లోని దళితుల్లో చైతన్యం తీసుకొస్తాం.. టి.జి భరత్
1 min readదళిత బిడ్డ మేలుకో పేరుతో టిడిపి కొత్త కార్యక్రమం
టిడిపి గెలిస్తేనే దళితులకు న్యాయం.. టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్లోని దళితుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు దళిత బిడ్డ మేలుకో పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ తెలిపారు. నగరంలోని మౌర్య ఇన్‌లో టిడిపి సీనియర్ దళిత నాయకులు, అనుబంధ సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. వాడవాడలా తిరిగి దళితులను కలిసేందుకు నేతలందరూ ఈ కార్యక్రమం చేసేందుకు ముందుకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏం చేశామన్నది వివరిస్తామన్నారు. దీంతో పాటు ఈ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలియజేస్తామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే దళితులందరికీ మేలు జరుగుతుందన్నారు. నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన నగరమా మేలుకో కార్యక్రమం మాదిరిగానే మైనారిటీ కమిటీ, మహిళా కమిటీ కూడా స్వతహాగా ముందుకొచ్చి కార్యక్రమాలు చేయడం సంతోషించే విషయమన్నారు. దళితుల నాయకుల ఆధ్వర్యంలో చేయనున్న ఈ కార్యక్రమాన్ని 33 వార్డుల్లో విజయవంతంగా పూర్తి చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, సీనియర్ నాయకులు బొల్లెద్దుల రామకృష్ణ, దేవా, సుంకన్న, పోతురాజు రవి, గున్నామార్క్, సురేంద్ర, మోహన్, నాగన్న సుందరరాజు, జూటూరు రవి, రాజ్ కుమార్, నరసింహులు, పాల్‌రాజ్, ప్రసాద్, ఈశ్వర్, పెంచలయ్య, శ్యాం, ప్రభాకర్, శ్రీనివాసులు, పవన్, పండు, కిరణ్, అజయ్, భాస్కర్, దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.