అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాం
1 min read
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని టిడిపి నాయకులు మాధవరం రాఘవేంద్ర రెడ్డి, ముత్తరెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, సురేష్ నాయుడు, మాధవరం రామకృష్ణ రెడ్డి లు హామీ ఇచ్చారు. మంగళవారం స్థానిక ఐసిడిఎస్ ఆఫీసు ముందు గత 15 రోజులుగా నిరసన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 15 రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం దిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వీరి సమస్యలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.