పార్కులు నిర్మించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కాలుష్య కారకాలతో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్న కర్నూల్ నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆహ్లాదకరమైన వాతావరణ అవసరమని, అందుకే పసిపిల్లల నుండి పండు ముసలి వరకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని పెంపొందించే పార్కులను ఉన్నతంగా, సాధారణ ప్రజలకు సైతం అనుకూలంగా, అందుబాటులో ఉండేటట్లు సుందరీకరిస్తామని ఇందిరా గాంధీ నగర్ లో జరిగిన ప్రజా పలకరింపు యాత్రలో జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలతో పాటు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు. పాల్గొన్నారు.
