PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖరీఫ్ ధాన్యాన్ని మార్చి వరకు కొనుగోలు చేస్తాం..

1 min read

రైతులు ఆందోళన చెందవద్దు

తూఫాన్ కారణంగా రైతుల నష్టాలను తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..

పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల భీమా అందిస్తాం

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్ అరుణ్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  రాష్ట్రంలో ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల  వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్. అరుణ్ కుమార్ చెప్పారు.  పెదపాడు మండలం కొక్కిరపాడు, వట్లూరు,  రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలును, సీతారాంపురంలో దెబ్బతిన్న పంట పొలాలను,  శుక్రవారం అధికారులతో కలిసి  పరిశీలించి అక్కడ  రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ తూఫాన్ కారణంగా రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. పెదవేగి మండలం అమ్మపాలెం, పినకడిమి గ్రామాలలో కమిషనర్ అరుణకుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి, పెదవేగి తాసిల్దార్ నల్లమిల్లి నాగరాజు, పెదపాడు తాసిల్దార్ విజయకుమార్ తో కలిసి పంటలను. కల్లాల మీద తడిసిన ధాన్యం రాశులను పరిశీలించారు. రాష్ట్రంలోని రైతుల కోరిక మేరకు వారి వద్ద నున్న ధాన్యం మొత్తం కొనుగోలు చేసేవరకు వచ్చే ఏడాది మార్చి నెల  వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరచి ఉంచుతామన్నారు.   గత రబీలో అనుభవాలను దృష్ఠ్టిలో ఉంచుకుని ప్రస్తుత ఖరీఫ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా నవంబర్ నెలలోనే ప్రారంభించామన్నారు. వీటిని మార్చి వరకు రైతులు కోరారని, ఇందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్ణయించామని, అయినప్పటికీ ఎంత మేర ధాన్యం వచ్చినా సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత రెండు రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు.  నవంబర్ చివరిలో తూఫాన్ హెచ్చరిక నేపధ్ద్యంలో ముందుగానే ప్రభుత్వ యంత్రాంగాన్ని అపప్రమత్తం చేశామన్నారు. కోత కోసిన ధాన్యాన్ని రైతుల కల్లాల నుండి నేరుగా ఆఫ్ లైన్ విధానంలో  రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు.  వర్షాల కారణంగా పంట తడవకుండా ఉండేందుకు టార్పాలిన్ లు అందించడం జరిగిందన్నారు. తేమశాతం పై రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకోవాలని రైస్ మిల్లర్లు కోరడం జరిగిందన్నారు. అదేవిధంగా రైతులు కూడా తమ పంటను ఏదో రేటుకు దళారులకు తమ ధాన్యాన్ని అమ్ముకోవద్దని, వారి వద్ద ధాన్యం మొత్తాన్ని  ప్రభుత్వం కొనుగోలు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రైతుల పట్ల సానుకూలంగా ఉండాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.  కోత కోయవలసిన పంట లో మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి ఉందని, ఇందుకోసం ఫుడ్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా వారితో టెస్ట్ మిల్లింగ్ చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.  రంగుమారిన ధాన్యం, నూకశాతం పై రైతుకి, మిల్లర్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  పంట నష్టాలపై 3 రోజులలో సర్వే పూర్తి చేస్తామని, పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని, కోత కోయని పంట నష్టపోయిన వారికి పంటల భీమా కింద పరిహారం అందిస్తామని, ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 67 వేల  మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు.  ఇంతవరకు 1. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. గత రెండు రోజులగా తూఫాన్ వలన జిల్లాలో ఉంగుటూరు, భీమడోలు,  నిడమర్రు, దెందులూరు, పెదపాడు మండలాల్లో ధాన్యం అధికంగా సాగు చేస్తారన్నారు. తూఫాన్ హెచ్చరిక ముందస్తుగానే చేయడంతో రైతులను అప్రమత్తం చేయడం ద్వారా 28 వేల  మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణకు ప్రతీ మండలానికి తహసీల్దార్, ఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారులను సమాయత్తం చేశామన్నారు. వర్షం తగ్గిన తరువాత ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామన్నారు. రైతుల నుండి ధాన్యం సేకరణలో ఆన్లైన్ విధానం సడలించి ఆఫ్ లైన్ విధానంలో దగ్గరలోని రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు.  గురువారం నాటికి 800 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉండగా, వాటిని కూడా శుక్రవారం తరలించామన్నారు.  చింతలపూడి మండలం ప్రగడవరంలోని రైతు తూఫాన్ మూలంగా తన ధాన్యం తడిచి 28 శాతం తేమ కారణంగా మొలకెత్తిందని , దానిని కొనుగోలు చేయాలనీ కోరడం జరిగిందని, దీనిపై గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసి సొమ్ము చెల్లించడం జరిగిందని, దీనికి సంబంధిత రైతు ఆనందం వ్యక్తం చేశారన్నారు. ఎక్కడైనా తడిచిన, మొలకెత్తిన ధాన్యం ఉంటె మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రంగం చర్యలు తీసుకుంటున్నదన్నారు. జిల్లా పౌరసరఫరా అధికారి ఆర్. సత్యనారాయణ రాజు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి వై. రామకృష్ణ, ఆర్డీఓ ఎన్ . ఎస్. కె. ఖాజావలి , పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ డాక్టర్ మంజుభార్గవి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వెజ్జు వెంకటేశ్వరరావు, జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షులు ఆళ్ళ సతీష్ చౌదరి,  వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, పెదవేగి మండల వ్యవసాయ అధికారి ప్రియాంక, పౌర సరఫరాలు మరియు రెవెన్యూ తదితర  సిబ్బంది పాల్గొన్నారు.

About Author