NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధికారంలోకి వ‌స్తే మ‌ద‌ర్సాలు ర‌ద్దు చేస్తాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘‘దేశంలో 36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టారు. ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నాయి. కాశీలోని మసీదులోనూ ఇదే జరిగింది. తెలంగాణలోనూ మసీదులను తవ్వితే శివలింగాలు కనిపిస్తాయి. ఆ తవ్వకాల్లో శివలింగం కనిపిస్తే ఆ ప్రాంతం మాది (హిందువులది). శవాలు కనిపిస్తే మీది (ముస్లింలది). మసీదులు తవ్వేందుకు సిద్ధమేనా’’ అంటూ మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. ‘‘తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో కడిగేసి రామరాజ్యం స్థాపించి తీరుతాం. లవ్‌ జిహాదీ అంటే లాఠీ రుచి చూపిస్తాం. మత మార్పిడిలు చేస్తే మక్కెలిరగదీస్తాం. రాష్ట్రంలోని మదర్సాలు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా మారాయి. వాటికి కంప్యూటర్లు అందజేసి ఆర్థిక సహాయం చేయడం సిగ్గుచేటు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మదర్సాలను రద్దు చేస్తాం. ఉర్దూ భాషను శాశ్వతంగా తొలగిస్తాం. మైనారిటీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వాటిని వర్తింపజేస్తాం. అతి త్వరలో రజాకార్ల ఫైల్స్‌ సినిమా రాబోతోంది“ అని అన్నారు.

                                           

About Author