NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక పేరు మారుస్తాం : సోము వీర్రాజు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుంటూరులో జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చాల‌ని మ‌రోసారి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జిన్నా ట‌వ‌ర్ పేరు మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లోని కింగ్ జార్జ్ ఆస్ప‌త్రి పేరును కూడ మార్చాల‌ని మ‌రో కొత్త డిమాండ్ ను తెర‌మీద‌కు తెచ్చారు. కింగ్ జార్జ్ పేరుకు బ‌దులు.. తెన్నేటి విశ్వ‌నాథం, గౌతు ల‌చ్చ‌న్న పేర్లు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. చీప్ లిక్క‌ర్ పై త‌న వ్యాఖ్య‌ల‌ను సోము వీర్రాజు స‌మ‌ర్థించుకున్నారు. అలా చేస్తే కుటుంబానికి రెండు ల‌క్ష‌లు మిగులుతాయ‌ని అన్నారు.

                                    

About Author