PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక మాసానికి ఏర్పాట్లు పూర్తి చేస్తాం… శ్రీశైల ఈవో

1 min read

– వేకువజామున 4.00 నుండి దర్శనాల ప్రారంభం
– రద్దీ రోజుల్లో అభిషేకాలు నిలుపుదల
– లోక కళ్యాణం కోసం కార్తీక మాసం అఖండ శివచతుస్సప్తాహ భజన కార్యక్రమం
– రద్దీ రోజుల్లో భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది
– 7 తేదీ సాయంకాలం కృష్ణవేణి నది తల్లికి పుణ్య నదిహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది
– ఆలయ సిబ్బందికి ప్రత్యేక విధులు
పల్లెవెలుగు, వెబ్​ శ్రీశైలం: అక్టోబర్ 26 నుండి నవంబర్ 23 వరకు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో కార్తీక మాసోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులకు దిశా నిర్దేశం చేసామన్నారు. కార్తీక మాసం విశిష్టత మైనది కావున భక్తులు శ్రీశైల మల్లన్న అధిక సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర మల్లన్న దర్శించుకుంటారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు కార్తీకమాసం దీపారాధన చేసుకునే దానికి సదుపాయాలు ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు .ముఖ్యంగా కార్తిక సోమవారం ప్రభుత్వ సెలవు దినాలు భక్తుల రద్దీ ఉంచుకొని 15 రోజులు పాటు పూర్తిగా స్పష్ట దర్శనం నిలుపుదల చేస్తామన్నారు. ప్రభుత్వ సెలవు దినాలు మరియు సోమవారంలో భక్తులకు కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశారు ఈవో లవన్న తెలియజేశాడు. మూడు విడుదలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తారు.రద్దీ రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో జరిపించే కుంకుమార్చన. ఆలయ ప్రాకార మండపంలో నిర్వహించబడును క్షేత్రానికి వచ్చే భక్తులకు. ఉదయాస్తమన సేవ మరియు ప్రదేశకాల సేవ పరిమిత సంఖ్యలో టికెట్లు ఇవ్వనున్నారు. భక్తులకు ఆలయ సేవా టికెట్లు మరియు దర్శనం టికెట్లు పెంచలేదని గతంలో మాదిరిగానే ప్రస్తుతంకార్తీక మాసం సందర్భంగా అఖండ శివచతుస్సప్తాహ భజన కార్యక్రమ నిర్వహణ, నిరంతరంగా శివభజనక్లు, పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి, కార్తీక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. పౌర్ణమి రోజున పాతాళగంగ వద్ద కృష్ణవేణి నదీ తల్లికి పుణ్యహారతి, గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం, ఆలయ నిత్య కళావేదికతో పాటు హారతి రోజుల్లో పుష్కరిణి వద్ద ప్రతి రోజు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు.ఈ సందర్భంగా పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణీ విగ్రహానికి పూజాధికాలు, సారె సమర్పణ జరిపించబడుతాయి. దళారీ వ్యవస్థ అరికడతామన్నారు ప్రభుత్వ అనుమతితో మరియు ధర్మకర్తల మండలి అనుమతితో నూతన సేవలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఈవో లవన్న అడిషనల్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీశైలం ప్రభ ఎడిటర్ అనిల్ పిఆర్ఓ శ్రీనివాసులు ఏఈఓ హరిదాసు పాల్గొన్నారుస

About Author