NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిస్తాం : టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతకుముందు బిర్లాగేట్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు ఇంచార్జి ఆకెపోగు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ సమాజం కోసం తన జీవితాన్నే త్యాగం చేశారని జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. కుల వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడాలని పోరాటం చేశారన్నారు. ముఖ్యంగా సమాజంలో మహిళలు విద్యను అభ్యసించేందుకు ఎంతగానో క్రుషి చేశారన్నారు. అనంతరం సోమిశెట్టి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో మేమంతా నడుస్తామన్నారు. కోట్ల మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. ఆయన స్పూర్తితో తామంతా ముందుకు వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు సత్రం రామకృష్ణుడు, కార్పొరేటర్ పరమేష్, నేతలు నాగరాజు యాదవ్, సంజీవలక్ష్మి, జూటూరు రవి, ముంతాజ్, రాజ్యలక్ష్మి, తిరుపాల్ బాబు, బాలు, విక్రమ్ సింగ్, ఈశ్వర్, దాస్, సురేష్, చంద్రకళ భాయ్, మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.

About Author