NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ వైఖరి మారేంతవరకు ఉద్యమం కొనసాగిస్తాం..

1 min read

నగరపాలక సంస్థ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు డి వేణుగోపాల్

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: పిఆర్ సి సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల సంఘల ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ  అన్ని విభాగాల నుంచి ఉద్యోగులు పాల్గొన్నారు, ఉద్యోగులు హక్కుల సాధనకై గత 2 రోజుల నుంచి దీక్షా శిబిరంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు,మూడవరోజు ఏలూరు మున్సిపల్ ఎంప్లాయిస్ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డి వేణు గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం పిఆర్సి విషయంలో మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు,ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వ వైఖరిని మారేంతవర కు కొనసాగిస్తామన్నారు, ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు కె నాగరాజు, నాలుగో తరగతి ఉద్యోగుల  సెక్రటరీ సిహెచ్ కాంచన రావు, తదితరులు పాల్గొన్నారు.

About Author