ఉద్యోగుల సమస్యలు పరిష్కారించేంతవరకు పోరాటం కొనసాగిస్తాం
1 min read– సియస్ గారికి ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.
– చేయి చేయి కలుపుదాం విజయవాడ లోని కార్యాలయాల సందర్శనలో
– అమరావతి సంఘ రాష్ట్ర ప్రతినిధులు శ్రీ వసంతరాయలు గారు & కుమార్ రెడ్డి గారు
పల్లెవెలుగు వెబ్ అమరావతి: ఎపి జెఏసి అమరావతి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ) రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ లో భాగముగా 17 18 మరియు 20 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయను సందర్శిస్తూ ‘ చేయి చేయి కలుపుదాం’ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు తేదీ 20.03.2023 కర్నూలు జిల్లాలో పర్యటించిన APJAC అమరావతి రాష్ట్ర ప్రతినిధులు. శ్రీ వసంతరాయలు గారు మరియు శ్రీ కుమార్ రెడ్డి గారు కలెక్టరు కార్యాలయము మరియు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి తదుపరి APSRTC మరియు జిల్లాపరిషత్తు ఆవరణలో గల కార్యాలయాలలోని ఉద్యోగులను కలుసుకొని మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఉద్యోగ,ఉపాధ్య,కార్మిక,రిటైర్డు,కాంట్రాక్టు & ఔట్ సొర్శింగు ఉద్యోగులకు సంబందించిన ఆర్థిక, ఆర్దికేతర సమస్యల సాధన కోసం,ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం కొనసాగుతున్న ఈ పోరాటం లో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం పై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు ఈ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలలో బాగంగా ఈనెల 21 నుండి చేపట్టబోయే “వర్క్ టూ రూల్” అనగా ఉదయం 10.30గం. నుండి సాయింత్రం 5.00 వరకు ప్రభుత్వ పని గంటలలో మాత్రమే పనిచేయాలని కర్నూల్ జిల్లాలోని ఉద్యోగులందరినీ కోరారు.తదుపరి శ్రీ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ apjac అమరావతి రాష్ట్ర కార్యావర్గం నిర్ణయించిన వివిధ రకాల నిరసన కార్యక్రమాలు ప్రతీ ఉద్యోగి పాల్గోని తేదిః 5.4.23 తేది వరకు నల్ల బ్యాడ్జిలతో నిరసనతోపాటు ఈనెల 21 నుండి ప్రతిఉద్యోగి వర్క్ టూ రూల్ అనగా ప్రభుత్వం నిర్దేశించిన పని గంటలలో మాత్రమే పనిచేయాలని ఉద్యోగులందరిీనీ కోరారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుండి చట్టబద్ధంగా రావాల్సిన పాత పెండింగ్ బకాయిలు అనగా డిఎ అర్రియర్స్, పిఅర్సి అర్రియర్స్, తదితర ఇతర అనేక ఆర్ధిక మరియు అర్డికేతర సమస్యల పరిష్కారానికి వ్రాత పూర్వకమైన హామీని ఇవాల్సిందేనని, న్యాయమైన మా సమస్యల పరిష్కారం చేసేంతవరకు ఈ ఉద్యోగులఉద్యమం ఆపెదేలేదని ప్రభుత్వానికి తెలిసే విధంగా అందరూ ఉద్యోగులు కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేద్దాం అని తెలిపారు.అదేవిధముగా APJAC అమరావతి జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి గారు మాట్లాడు తూ ఉద్యోగుల ఆర్ధిక, అర్ధికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని మిగిలిన సమస్యలపై నిర్ధిష్టమైన రోడ్ మ్యాప్ వ్రాత పూర్వకమైన హామీ 5 వ తేది లోపు రాని పక్షంలో ఆ తదుపరి ఉద్యమకర్యచరణ ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ప్రతిఉద్యోగిని కలసి చేయి చేయి కలుపుదాం కార్యక్రమంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, రావల్సిన బకాయిలను, ఉద్యోగులకు హామీ ఇచ్చిన అమలు పరచని హామీలు ప్రధానంగా సిపియస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపుదల, ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో వినియోగం లోకి తీసుకు రావడం, చనిపోయిన ఉద్యోగ కుటుంబాల్లో అర్హత కలిగిన వారికి కారుణ్య నియామకాలు చేపట్టడం తదితర ప్రభుత్వం ఇచ్ఛిన హామీలు అమలుచేయాలనిప్రభుత్వాన్ని APJAC అమరావతి రాష్ట్ర ప్రతినిధులు కోరారు. ఈ ఉద్యమానికి వివిధ శాఖల ఉద్యోగులు శాఖలకు అతీతంగా ప్రతి ఉద్యోగి అందరు మద్దతు పలికి ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని జిల్లాలోని ఉద్యోగులకు విజ్ఞప్తి చేసారు.అలాగే, ఈ 27వ తేదీన కారుణ్య నియామకాలు పొందని కుటుంబాల ఇండ్ల సందర్శన తదితర ఆందోళన కార్యక్రమాలు గూర్చి ఉద్యోగులకు వివరించి అందరూ స్వచ్చందం గా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ అవగాహన కల్పించటం జరిగింది. అప్పటికి మన న్యాయమైన ఆర్ధిక, అర్ధికేతర సమస్యలపై ప్రభుత్వం స్పందించీ పరిష్కరించక పోతే ఏఫ్రిల్ 5 న జరగబోవు రాష్ట్రకార్యవర్గసమావేశంలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులైన డాక్టర్ వసంతరాయలు గారు, కుమార్ రెడ్డి గార్లతో పాటు AP JAC అమరావతి జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కే .వై . కృష్ణ , APRSA జిల్లా కార్యదర్శి నాగరాజు టైపిస్ట్&స్టెనోగ్రాఫర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ PR ఇంజనీర్ల సంఘం జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు రవీంద్ర రెడ్డి, సతీష్, APJAC అమరావతి మహిళా విభాగం కర్నూల్ జిల్లా చైర్మన్ శ్రీమతి శోభాసువర్ణమ్మ, వి.ఆర్.ఓ ల సంఘ జిల్లా నాయకులు సూరిబాబు , మద్దిలేటి,స్వామన్న,ప్రభావతి, గిడ్డయ్య APRSA కలెక్టరేట్ అధ్యక్షులు వెంకటరాజు APRSA స్పోర్ట్స్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి , APJAC అమరావతి న్సంద్యాల జిల్లా వైస్ చైర్మన్ అప్పరాజు రామచంద్ర రావు గ్రామవార్డు సచివాలయాలు జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, ప్రతాప్ APSRTC ప్రాంతీయ CHAIRMAN ఏ.వి. రెడ్డి RWS జిల్లా చైర్మన్ ఇస్మాయిల్ , APRSA జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లోకేశ్వరి పాల్గొన్నారు.