క్రీడల అభివృద్ధికి సహకరిస్తాం .. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ నగరంలో క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని సుంకేసుల రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన ర్యాలీ స్పోర్ట్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ క్రీడలు అభివృద్ధికై ప్రైవేట్ అకాడమీలు ఏర్పాటు కావడం అభినందనీయం అన్నారు. తాను బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియంలో అభివృద్ధికి ఎంతగానో కృషి చేసామన్నారు. ప్రభుత్వ నిధులతో అలాగే సొంత నిధులతో ఇండోర్ స్టేడియాలను అభివృద్ధి చేశామన్నారు. అన్ని క్రీడల్లో కన్నా బాల్ బ్యాడ్మింటన్ క్రీడా తక్కువ స్థలంలో ఎక్కువమంది ఆడుకునే విధంగా రూపొందించ వచ్చని దీనివల్ల ఎక్కువమంది క్రీడాకారులు తయారు కావడానికి అవకాశం ఉందన్నారు. పిల్లలు ఆడుకోవడానికి చిన్నప్పటినుంచే ప్రోత్సహించాలని చదువుతో పాటు క్రీడలలో పాల్గొంటే వారికి శారీరిక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారని టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు విజయరాజ్, రాధా రాణి తదితరులు పాల్గొన్నారు.