PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ప్రాంతీయ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడిస్తాం .!

1 min read

నందికొట్కూరులో బీజేపీదే విజయం.

బీజేపీ జిల్లా కార్యదర్శి గూడూరు రవికుమార్ రెడ్డి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వచ్చే ఎన్నికల్లో నందికొట్కూరు ఎమ్మెల్యేగా గెలవబోయేది బిజెపి అభ్యర్థి అని బిజెపి జిల్లా  కార్యదర్శి గూడూరు రవికుమార్ రెడ్డి  అన్నారు.నందికొట్కూరు పట్టణ బిజెపి కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు నిత్యం  అందుబాటులో ఉన్నటువంటి బిజెపి కార్యకర్తలనీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.  అధికారం కోసం టీడీపీ,వైసీపీ పార్టీలు పాకులాడుతున్నాయన్నారు. రాబోవు ఎన్నికలలో  రెండు పార్టీ లను  ప్రజలు  ఇంటి కి పంపడానికి సిద్ధంగా ఉన్నారని జోష్యం చెప్పారు.ప్రాంతీయ పార్టీలైన వైసీపీ ,టీడీపీలను బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శభరి నాయకత్వంలో  చిత్తుగా ఒడిస్తామన్నారు.  నందికొట్కూరు నియోజకవర్గంలో  ప్రాంతీయ పార్టీలు అయినా వైసీపీ టిడిపి కలిసి పోటీ చేసిన కూడా  బిజెపి విజయాన్ని నందికొట్కూరులో  ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు.

About Author