PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువలకు రాజకీయ అవకాశాలు కల్పించని పార్టీలను ఓడిస్తాం

1 min read

రవికుమార్,చైర్మన్ కురువ,మదాసి కురువ/మదారి కురువ పొలిటికల్ జేఏసీ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో కురువ,మదాసి కురువ మదారి కురువలకు రాబోయే 2024ఎన్నికల్లో  యంపీ, ఎమ్మెల్యే స్థానాలను కేటాయించని పార్టీలను చిత్తుచిత్తుగా ఓడిస్తామని కురువ మదాసి కురువ మదారి కురువ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రవికుమార్ అన్నారు కర్నూలు నగరంలోని స్థానిక జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కురువ మదాసి కురువ మదారి కురువ  పొలిటికల్ జేఏసీ చైర్మన్ రవికుమార్,డాక్టర్ లక్ష్మీ ప్రసాద్,వైస్ చైర్మన్లు మదాసి కురువ తిరుమలేష్ ,కె.బలరాం, బత్తిన కిరణ్ కుమార్,కురువ మహేంద్ర,పర్ల కురువ మహానంది కురువ ఎల్లప్ప లు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు కర్నూలు జిల్లాలో కురువ,మదాసి కురువ/మదారి కురువ సామాజిక వర్గం జనాభా తక్కువ ఉందన్న తప్పుడు సర్వే రిపోర్టులు చూపించి యంపీ, ఎమ్మెల్యే టికెట్లను కేటాయింపులో కురువ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యానికి గురిచేస్తుందన్న విషయం జేఏసీ దృష్టికి వచ్చినది అలాంటి పరిస్థితే ఏర్పడితే కురువ, మదాసి కురువ/మదారి కురువ సామాజిక వర్గం అలాంటి పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించడానికి సిద్దంగా ఉందని రాజకీయ పార్టీలను హెచ్చరించారు. అలాగే వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 90శాతం గ్రామాలలో కురువ సామాజిక వర్గం జనాభా ఉన్నది కురువ పేరుతో జిల్లాలో కొన్ని గ్రామాలే ఉన్నాయన్న విషయం రాజకీయ పార్టీలకు,ప్రజలకు తెలియనిది ఆలూరు నియోజకవర్గంలో 70వేలు పత్తికొండ నియోజకవర్గంలో 70వేలు ఎమ్మిగనూరు 50వేలు,ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలలో 45వేలకు పైగా కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో 35వేలకు పైగా కురువ సామాజిక వర్గం ఓటుబ్యాంకు ఉన్నదని అయిననూ రాజకీయ పార్టీలు కురువ, మదాసి కురువ/మదారి కురువ సామాజిక వర్గానికి రాజకీయ అవకాశాలు లేకుండా చేస్తున్నాయి అటువంటి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అన్నారు. తప్పుడు సర్వే రిపోర్టుల ప్రకారం తీసుకున్న నిర్ణయాలను పార్టీలు తక్షణమే సరిదిద్దుకుని కర్నూలు జిల్లాలో 4లక్షలకు పైగా కురువ సామాజిక వర్గం ఓటుబ్యాంకు కలదన్న విషయం గ్రహించి కురువ, మదాసి కురువ/మదారి కురువలకు జిల్లాలో ఒక యంపీ,రెండు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేసారు.కురువ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తమసాటి కులాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓబిసీ, ఒసీలను కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారని కురువలను గుర్తించి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీలకే అండగా నిలుస్తామని లేని పక్షంలో అన్ని నియోజకవర్గాల్లో కురువలు ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం,నోటా కు ఓటు వేయడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కురువ పురుషోత్తం,కురువ శ్రీనివాసరావు,కురువ నాగరాజు, కురువ శ్రీనివాసులు, చెరుకలపాడు రామాంజి,వెల్దుర్తి గోపాల్,కురువ మద్దిలేటి,కల్లూరు భాస్కర్,పర్ల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

About Author